కటక్ ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్ర‌మాదం

– ఐసీయూలో చెలరేగిన మంటలు
– పదిమంది రోగుల దుర్మరణం

భువనేశ్వర్, మార్చి 16 : ఒడిషా రాష్ట్రం కటక్ సిటీలోని ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదిమంది రోగులు దుర్మరణం చెందారు. మరో 11మంది సిబ్బందికి కూడా కాలిన గాయాలయ్యాయి. కటక్‌లోని ఎస్‌సీబీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ట్రామా కేర్ విభాగం ఐసీయూలో ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగగా రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. రోగులను ఐసీయూ నుంచి బయటకు తీసుకువెళ్లే క్రమంలో పలువురు సిబ్బంది గాయ‌ప‌డ్డారు. ఒడిశా సీఎం మోహన్‌చరణ్ మాఝీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్ప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ తెల్లవారుజామున 2.30 నుంచి 3 గంటల మధ్య ప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగగానే తాము రోగులను ఐసీయూ నుంచి బయsటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశామని హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. ఘటన సమయంలో ఐసీయూలో, ఆ పక్కన ఉన్న వార్డులో మొత్తం 23మంది రోగులు చికిత్స పొందుతున్నారని, వారిని తరలిస్తుండగా అప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో ముగ్గురు తరలించే క్రమంలో మృతిచెందారని వెల్లడించారు.
———————————————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *