– మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి, చేయడానికి ఏమీ లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొడుతున్నారని తెలిపారు. తాను చనిపోయే పరిస్థితి వచ్చిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని, మున్సిపల్ ఎన్నిలకు ముందు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తలేమని డీజీపీ చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. డిపార్టుమెంట్ చేసే పనులకు, ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. అరాచక శక్తులు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయి బీఆరఎస్‌ను బద్నాం చేస్తున్నాయని విమర్శించారు. హామీలు అమలు చేయలేక పోలీసులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, పోలీసులతోనే నామినేషన్లు వేయిస్తున్నారని ఆరోపించారు. జడ్చర్లలో కాంగ్రెస్ నాయకుడు ఎస్సై గల్లా పట్టుకున్నాడని, పోలీసులను కొడుతుంటే ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. నిజాయతీగా పనిచేసే పోలీసులను లూప్‌లైన్‌లో పెడుతున్నారన్నారు. జీవితాలు త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇప్ప్పుడు తెలంగాణ ద్రోహులు ఆ వ్యవస్థలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు ఓయూ, అశోక్ నగర్ వెళ్లి మాట్లాడే పరిస్థితి లేదని, హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ లేదని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





