రీసైక్లింగ్ అత్యంత కీలకం

– క్రిటికల్ మినరల్ రంగంలో ఆత్మనిర్భరత సాధన య‌త్నం
– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

న్యూదిల్లీ, ఏప్రిల్ 1: సుస్థిరమైన, పర్యావరణహిత విధానాల ద్వారా కీలక ఖనిజాల భద్రతను సాధించేందుకు భారత ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ప్రైవేటు సంస్థ లోహుమ్ ఆరఅండ్ డీ కేంద్రాన్ని, అలాగే లిథియం, కోబాల్ట్ రిఫైనరీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిటికల్ మినరల్ రీసైక్లింగ్ కేంద్రాలు ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అక్కడి సైంటిస్టులు, ఇంజినీర్లు, ఆర్ అండ్ డీ సిబ్బందితో మాట్లాడి ఉపయోగించిన బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి లిథియం, కోబాల్ట్‌ను రీసైక్లింగ్, రీపర్పసింగ్ చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆధునిక రీసైక్లింగ్ సాంకేతికతలు, వాటి సామర్థ్యం, పర్యావరణ ప్రయోజనాలను కేంద్ర మంత్రికి సవివరంగా తెలియజేశారు. రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా లిథియం ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద సంస్థ అయిన లోహుమ్ సంస్థ ద్వారా జరుగుతున్న ప్రయత్నాలను కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈ రీసైక్లింగ్ ద్వారా క్రిటికల్ మినరల్స్ కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతోపాటు డొమెస్టిక్ సప్లయ్ చైన్స్ బలోపేతం అవుతాయన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ కోసం పోటీ పెరిగిందన్నారు. అందుకే భారత దేశంలో క్రిటికల్ మినరల్స్ నిల్వలు తక్కువగా ఉన్నందున రీసైక్లింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. క్రిటికల్ మినరల్స్ వ్యూహాత్మక ప్రాధాన్యతను భారత ప్రభుత్వం గుర్తించి వాటి లభ్యతను నిర్ధారించేందుకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్(ఎన్‌సీఎంఎం)ను ప్రారంభించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఎన్‌సీఎంఎంలో భాగంగా విదేశాల్లో ఖనిజ వనరుల కోసం ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం, దేశీయంగా ఎక్స్‌ప్లొరేషన్‌కు ప్రోత్సాహాన్ని అందించడం, రీసెర్చ్ నaస్త్రcH డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు మద్దతు, రీసైక్లింగ్ వంటి అంశాలను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంటోందని తెలిపారు. రూ.32,000 కోట్లతో మిషన్ మోడ్‌లో ప్రారంభించిన ఎన్‌సీఎంఎం ద్వారా ఎక్స్‌ప్లొరేషన్, మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ రంగాలలో సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు.అర్బన్ మైనింగ్ ప్రాముఖ్యతను కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వివరించారు. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్, అటోమొబైల్ వ్యర్థాలలో లిథియం, కోబాల్ట్, నికెల్‌తోపాటు వివిధ అరుదైన మూలకాలు ఉన్నాయని, వాటిని సక్రమంగా సేకరించి ప్రాసెస్ చేస్తే వనరులను సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పారు. భూమిలో కలిసిపోవడం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా బాటలు వేయొచ్చన్నారు. క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్‌ను భారత్ వేగంగా విస్తరించేందుకు ఇదే సరైన సమయమని, సుస్థిరాభివృద్ధి, పర్యావరణహిత విధానాలు దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వానికి అత్యంత అవసరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చే ఈ విధానం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే కాకుండా పెద్దఎత్తున మన దేశంలో ఉపాధి అవకాశాలను సృష్టించడం, సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడం, దేశ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్లడాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. క్రిటికల్ మినరల్ రంగంలో పనిచేస్తున్న పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం ఇస్తోందన్నారు. విధానపరమైన మద్దతు, ఇన్సెంటివ్స్‌తోపాటు అనుబంధ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచనలకు ఇండస్ట్రీ, రీసైక్లింగ్, ప్రాసెసింగ్ సంస్థలు సంపూర్ణ సహకారం అందిస్తే క్రిటికల్ మినరల్ రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించడం ఖాయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *