7వ విడత క్రిటికల్ మినరల్ వేలం ప్రక్రియ ప్రారంభం

– డీఎంఎఫ్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూదిల్లీ, మార్చి 23: క్రిటికల్ మినరల్స్‌కు 7వ విడత వేలం ప్రక్రియ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర, బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇందులో మొత్తం 19 బ్లాక్స్‌కు వేలం వేస్తున్నామని, ఇప్పటివరకు ఆరు విడతల్లో 46 క్రిటికల్ మినరల్ బ్లాక్స్‌ను విజయవంతంగా వేలం నిర్వహించామని తెలిపారు. దిల్లీలో సోమవారం జరిగిన నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ వేలంలో తొలిసారిగా నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ గుర్తించిన బ్లాక్స్‌ను కూడా చేర్చామన్నారు. .ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని గనుల రంగం ఆధునిక సాంకేతిక వినియోగంతో సంస్కరణలు, పారదర్శకత, సమర్థత దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. గ్లోబల్ టెక్నాలజీ, ఎనర్జీ ట్రాన్సిషన్ విషయంలో క్రిటికల్ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి ఉత్పత్తి, రక్షణ రంగంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. గనుల రంగం తక్కువ కాలంలోనే గణనీయమైన పురోగతి సాధించిందని, ఈ ప్రయాణంలో ప్రైవేటు రంగం కూడా ఎంతో కీలక పాత్ర పోషించిందని వివరించారు. అభివృద్ధి అనేది సమతుల్యంగా ఉండాలని, పర్యావరణానికి నష్టం కలగకుండా ఉండేలా చూడాలని తెలిపారు. గనుల వల్ల ప్రభావితమయ్యే స్థానిక ప్రజలకు అభివృద్ధి ద్వారా లాభం చేకూరాలనే ఉద్దేశంతో జిల్లాల మినరల్ ఫౌండేషన్లు స్థాపించామన్నారు. గనుల కోసం తమ స్థలాలను ఇచ్చేసిన స్థానికుల సంక్షేమం మనందరికీ ప్రాధాన్యత కావాలి. డీఎంఎఫ్ ద్వారా వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం, గనుల ప్రభావిత ప్రాంతాల్లో విద్య, వైద్యం వంటి కనీస అవసరాలు కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టిసారిం#లని, మరీ ముఖ్యంగా యాస్పిరేషనల్ జిల్లాల్లో ప్రత్యేకమైన వ్యూహాలతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతేడాది యాస్పిరేషనల్ డీఎంఎఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, జిల్లాల మినరల్ ఫౌండేషన్లను ఈ కార్యక్రమంతో అనుసంధానం చేసి చాలా వెనుకబడిన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో 656 జిల్లాల్లో డీఎంఎఫ్‌లు ఏర్పాటయ్యాయని, మొత్తం డీఎంఎఫ్ కింద రూ.1.24 లక్షల కోట్లలో రూ.93,500 కోట్లు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నాయని పేర్కొన్నారు. సుమారు 70% అభివృద్ధి పనులు ఈ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. గనుల మూత అనేది చాలా ప్రాధాన్యమైన అంశం. 2025 నాటికి 147 గనులను శాస్త్రీయంగా మూసేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని, తర్వాత ఈ ప్రాంతాల్లో సుస్థిరమైన అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు.

బొగ్గు రంగాన్ని ప్రక్షాళన చేశాం : రాజ్యసభలో మంత్రి కిషన్ రెడ్డి

ఒకప్పుడు బొగ్గు బ్లాకులను పేపర్‌పై రాసి ఇస్తే కేటాయించేవారు.. కానీ ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గు రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశామని మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రాజ్యసభలో సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పారదర్శకంగా వేలం ద్వారా ఎలాంటి అవినీతికి తావు లేకుండా బొగ్గు బ్లాకులు కేటాయిస్తున్నామన్నారు. దేశంలో థర్మల్ విద్యుత్‌లో 73 శాతం బొగ్గు ద్వారానే జరుగుతోందిదన్నారు. గతంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండేదని, వ్యవసాయ, పరిశ్రమలు, గృహ అవసరాలకు కూడా సరిపడ విద్యుత్ సరఫరా ఉండేది కాదని తెలిపారు. ఇవాళ మోదీ నేతృత్వంలో నయాభారత్.. సంకల్పిత లక్ష్యాలను చేరుకునే దిశగా దూసుకెళ్తోందన్నారు. దేశంలో ఎక్కడా విద్యుత్ కొరత లేదని, ఇందులో బొగ్గు పాత్ర చాలా కీలకమని, విద్యుదుత్పత్తి కోసం 80% బొగ్గును సరఫరా చేస్తున్నామని, సిమెంట్, స్టీల్, ఫెర్టిలైజర్ రంగాలకు కూడా బొగ్గును నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని వివరించారు. .దేశంలో దాదాపు 70 ఏళ్లకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. బొగ్గు నిల్వలో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉండగా ఉత్పత్తిలో, వినియోగంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. కోలిండియా ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా నిలిచిందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం, కాలుష్యాన్ని తగ్గించేందుకు కోల్ గ్యాసిఫికేషన్ సాంకేతికతను ప్రారంభించామన్నారు. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా 7 ప్రాజెక్టులు ప్రారంభించనున్నామని, 4 మహారాష్ట్రలో, 2 ఒడిశాలో, ఒకటి పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాయని, వాటిలో నాలుగింటికి భూమి పూజ కూడా జరిగిందని చెప్పారు. ఇందుకోసం రూ.64 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు దిగుమతులు తగ్గుతాయని చెప్పారు. కోల్ గ్యాసిఫికేషన్ కోసం ఇన్సెంటివ్స్ కూడా అందజేస్తున్నామన్నారు. 143 బొగ్గు గనులను శాస్త్రీయంగా మూసివేûసే పనులు ప్రారంభించామని మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కూడా కమిటీ ఏర్పాటు చేసి ఈ పనులను పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ ప్రాంతాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేస్తున్నామని, 2028 నాటికి 143 గనులను మూసేసి అభివృద్ది పనులను పూర్తి చేసేందుకు కృషిచేస్తున్నామని, దీంతో స్థానికులకు ఉపాధి కూడా దొరుకుతుందని చెప్పారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *