హిందూ స‌మాజాన్ని చీల్చేందుకు కుట్ర‌

-రోహింగ్యాలు గో బ్యాక్ అని ఉద్య‌మిస్తాం
– మేం ఓట్ల చోరీ చేస్తే, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ల్లో కాంగ్రెస్ గెలిచేదా?
-అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్న రాహుల్‌
– తిరంగా ర్యాలీలో  బండి సంజ‌య్ దూకుడు!

మర్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. శుక్ర‌వారం సాయంత్రం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో బీజేపీ సెంట్రల్ జిల్లా శాఖ అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా ర్యాలీ’’ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ మర్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ‘‘మర్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు. తెలంగాణను దోచుకోలేదు. వ్యాపారాలు చేసుకుంటూ సంపదను స్రుష్టించారు. జీడీపిని పెంపులో వారి పాత్ర చాలా ఉంది. హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారు. అట్లాంటి మర్వాడీలు తెలంగాణ నుండి ఎందుకు వెళ్లిపోవాలి?’’అని ప్రశ్నించారు. మర్వాడీ గో బ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని అన్నారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మర్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే బీజేపీ పక్షాన ఒక వర్గం నిర్వహించే మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులకు వ్యతిరేకంగా హిందూ కుల వ్రుత్తులను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *