దేశంలోని ప్రస్తుతం చాలా రాజకీయ పార్టీలు వ్యూహకర్తల్ని, వ్యూహ సంస్థల్ని ఏర్పాటు చేసుకుం టున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు వారి సేవ ల్ని పొందుతున్నాయి. ఈ క్రమంలో పార్టీల పని తీరులో, నాయకుల వ్యవహార శ్కెలిలో మార్పు స్పష్టంగా కనిపి స్తోంది. రాజకీయ పార్టీలు నేటి కార్పొరేట్ ప్రపంచానికి తగినట్టు మారుతున్నాయి. గతంలో పార్టీలోనే వ్యూహకర్తలు ఉండేవారు. పార్టీ విధానాలకు తగినట్టు ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచించేవారు. అయితే ఇప్పుడు వారు మాత్రమే సరిపోతారని ఏ పార్టీ అనుకోవటంలేదు.. పదు న్కెన వ్యూహాల కోసం బయటి సంస్థలను ఆశ్రయిస్తున్నాయి. ముఖ్యంగా సామాన్య ప్రజలతోనే కాకుండా కార్యకర్తలతో భేటీలను నాయకులు తగ్గించు కోవటం ఒక ముఖ్యపరిణామం. ఫలితంగా పార్టీ కార్యకర్తల ద్వారా పబ్లిక్ మూడ్ తెలుసుకునే పద్దతికి దూరమయ్యారు. దాంతో ప్రజలు ఏమనుకుంటున్నారో వారికి ప్రత్యక్షంగా తెలియటం లేదు. తమ వ్యూహకర్తలో, సంస్థలో ఇచ్చే సమాచారం విరీదే వారు ఎక్కువగా ఆధారపడుతున్నారు. దాంతో, ఎన్నికల్లో తమకు కలిసొచ్చే పరిస్థితుల కన్నా బెడిసికొట్టే సందర్భాలే ఎక్కువని తెలంగా ణ, ఏపీ ఎన్నికలు నిరూపించాయి.!
పార్టీ టిక్కెట్లివ్వటం నుంచి ప్రచారాంశాలు, ప్రాధాన్యతలు, పదవులు, బాధ్యతల కేటాయింపు వరకు అన్నీ వ్యూహకర్తలు సంస్థలు సర్వే జరిపి ఇచ్చే సమాచారం ఆధారంగా చేస్తున్నారు. ఒకోసారి సర్వే బూచి చూపి నాయకులతో తమ ఇష్టాయిష్టాలను అమలు చేయిస్తుంటారు. ఇక, పార్టీ గెలిస్తే తమవల్లే అంటారు…ఓడితే మాత్రం బాధ్యత వహించవు. 2019లో వైసీపీ 151 స్థానాలు గెలిస్తే, అది తమ క్రెడిట్‌గా చెప్పుకున్న ఐప్యాక్ ..2024లో అదే పార్టీ, 11 స్థానాలకు పడిపోయినపుడు ఓటమికి కూడా సమాన బాధ్యత వహించాలి కదా! కర్నాటకలో, తెలంగాణలో ఆనాడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు వాతావరణం కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. కానీ, అదంతా తాము నమ్ముకున్న వ్యూహకర్త గొప్పతనమనుకొని పార్టీ వ్యవస్థ మొత్తాన్ని ఆయన చెప్పుచేతల్లో పెట్టింది. ఫలితం..హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజ యం. కాబట్టి ప్రజాదరణ ఉండాలే తప్ప వ్యూహం పన్ని, ప్రభుత్వాధికారుల్ని బదిలీ చేసినట్టు అభ్యర్థులను అటు ఇటు మారిస్తే గెలవరు. రెండు వేల సంవత్సర మొదటి దశకం నుంచి ఈ అవలక్షణాలు మొదలయ్యాయి. పార్టీ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు, వివిధ సామాజిక వర్గాల వృత్తుల నాయకుల మాటల్ని రాజకీయ పార్టీలు పరిగణనలోకి తీసుకోవడం లేదు, నేతలకు జనంతో సంపర్కం పోయింది. నెహ్రూ, ఇందిర, వాజ్‌పేయ్ వంటి కేంద్ర నాయకులతో పాటు చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఎన్‌టిఆర్, వైఎస్‌ఆర్ వంటి రాష్ట్ర నాయకులు వివిధ పద్ధతుల్లో జనంతో కలిసిపోయారు. ప్రజల మనోగతంపై పార్టీల స్థాయిలో మథనం జరిగేది. జనాభిప్రాయం తెలుసుకొని, అవసరాలు తీరుస్తూ వారి విశ్వాసం పొందడం ద్వారా గెలవాలనే తలంపే క్రమంగా మరుగునపడుతోంది.
పార్టీలు నియమించుకునే వ్యూహకర్తలు సంస్థల్లోని అత్యధికులు మేనేజ్‌మెంట్ కోర్సులు చేసినవారు. కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల పక్రియను కూడా సవిరీపంగా చూసి ఉండరు. ప్రజల్ని కేవలం ఓటర్లుగా, ఇంకా చెప్పాలంటే మార్కెట్‌గా చూసే వారి కంటికి రాజకీయ పార్టీ ఒక కమోడిటీగా మారింది. దానిని ఎలాగైనా కొనిపించటమే వారి పని! ఇక్కడ కొనపించటమంటే జనం తో వోట్లేయించటం. ఈ పొలిటికల్ మార్కెటింగ్ ఎవరు బాగా చేస్తే వారే ఎన్నికల మార్కెట్లో నిలబడతారు. అందుకే, వారి న్కెపుణ్యాల అమ్ములపొది నుంచి స్కీంలు, రిబేట్లు, డిస్కౌంట్లు, ఆఫర్లు వచ్చాయి. నవరత్నాలయినా, గ్యారెంటీలయినా.. వీటి మూలాలు ఈ వ్యూహకర్తల వ్యాపారపు మెదళ్ల నుంచి పుట్టినవే. ఇండియా షైనింగ్, నుంచి బ్కె బ్కె బాబు వరకు, ఇంటికో ఉద్యోగం నుంచి ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని వరకు, సబ్ కే సాత్ సబ్ కా వికాస్ నుంచి బాటింగేతో కాటింగే వరకు ప్రాసలతో కూడిన నినాదాల జోరంతా వ్యూహకర్తల చలువే! నినాదాలతో ప్రజల్ని అమాయ కులను చేసి తమ వైపుకు లాక్కోవాలనుకోవటానికి బదులు.. జనం అసలు ఏం కోరుకుంటున్నారో గ్రహించి, అవి తమ విధానాలుగా ప్రకటించే చొరవ రాజకీయ పార్టీల్లో ఉండాలి.
కానీ దురదృష్ట వశాత్తు ఇప్పడు వాటిలో అది తగ్గుతోంది. రాజకీయం వ్యాపారం కాదు, సేవ అనే స్పృహ లోపిస్తోం ది. వ్యూహకర్తల ఎత్తులు%`%జిత్తుల కన్నా ప్రజల మనోభావాలే తమ రాజకీయ మనుగడను శాసిస్తాయ నే వాస్తవాన్ని పార్టీలు మరచిపోతున్నాయి. కార్యకర్తల్ని లక్ష్యపెట్టడం లేదు. రాజకీయ పార్టీలు ఒకప్పుడు సిద్దాంతరీత్యా బలంగా ఉండేవి. విధానాలపై చర్చ, మేధో మథనానికి భేటీలు జరిగేవి. విధానపత్రాలు వెలువరించేది. ఎప్పటికప్పుడు శిక్షణా శిబిరాలుండేవి. 1995లో అధికార మార్పిడి తర్వాత సిఎం అయిన చంద్రబాబు, అటు ప్రజాక్షేత్రంలో నిరంతర కార్యక్రమాల్లో, ఇటు పార్టీ కార్యాలయంలో రోజూ సగటున రెండు, మూడు గంటలు గడిపేవారు. అధికారంలో ఉన్నా, దాదాపు అన్ని ప్రధాన పార్టీలకూ కార్యక్రమాలుండేవి. అట్టడుగు స్థాయి సమావేశాలు, ఇంటింటికీ వెళ్లటం, ప్రతి మనిషినీ కలవడం వంటివి తరచూ జరిగేది. వీటన్నిటి ద్వారా ప్రజలతో రాజకీయ నాయకులకు ప్రత్యక్ష బంధం ఏర్పడేది.
అది వారి ఆలోచనా విధానాన్ని, పాలనా పద్‌ధ్దతుల్ని ప్రభావితం చేసేది. ఇప్పుడేవిరీ జరగట్లేదు, జరిగినా తూతూ మంత్రంగానే! కాలేజీలు, యూనివర్శిటీల్లో ’విద్యార్థి రాజకీయాల’ ద్వారా యువతరం రాజకీయాల్లోకి వచ్చే మార్గమొకటి ఉండేది. అక్కడ్నుంచి యువనాయకుల్ని పార్టీలు ఎంపిక చేసుకునే ’క్యాంపస్ సెలక్షన్’ పక్రియ అమలయ్యేది. ఫలితంగా ప్రజలనాడి ప్రాధాన్యత తెలిసిన యువతరం రాజకీయాల్లో క్రమంగా ఎదిగేది. పార్టీల్లో ప్రతి ఎన్నిక తర్వాత గెలుపోటముల్ని అధ్యయనం చేసే సవిరీక్షలుండేవి. చంద్రబాబు 27కు పరిమితమైనప్పుడు గానీ, జగన్మోహన్ రెడ్డి 11కు దిగజారినప్పుడు గానీ, కెసిఆర్ ఆరుమాసాల్లో రెండు ఎన్నికల్లో ఘోరంగా ఓడినపుడు గానీ నిజాయితీ సవిరీక్షలే జరుగలేదు. ఇక తప్పొప్పులు ఎలా తెలుస్తాయి? పార్టీల బలహీనతలు తెలుసు కాబట్టే వ్యూహ సంస్థలు, వ్యూహకర్తలు వారిని తమ బుట్టలో వేసుకుంటున్నారు. వారి బంధం కొనసాగుతూనే ఉంటుంది!
-ఎం.మహేందర్





