– కోవాసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
– ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల సాంకేతిక సహకారంతో మరో రెండు నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడిరచారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, చదువులు పూర్తి చేస్తున్న విద్యార్థులకు దీని ద్వారా నూతన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. కోవాసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించిన సందర్బంగా ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం 500మంది ఇంజనీర్లు పనిచేస్తున్న కోవాసెంట్ మరో రెండేళ్లలో 3000 మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ఏఐ సాంకేతిక దూకుడుతో కోడిరగ్‌లో ఉన్నవారు, ఇతర ప్లాట్‌ఫారాల్లో పనిచేస్తున్న వారు నైపుణ్యాలను పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడిరదన్నారు. వారందరికీ ఏఐ యూనివర్సిటీ ద్వారా రీ స్కిల్, అప్ స్కిల్స్ అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఇకపై టెక్నాలజీ హబ్ మాత్రమే కాదు.. ఇది ఏఐ కమాండ్ సెంటర్‌గా, ప్రపంచ ఉత్పత్తులు రూపొందే స్థలంగా, భద్రమైన, బాధ్యతాయుతమైన ఏఐ భవిష్యత్తును నిర్మించే కేంద్రంగా మారుతోందని శ్రీధర్‌బాబు అన్నారు. ఈ సందర్భంగా కోవాసెంట్ చైర్మన్ సి.వి.సుబ్రమణ్యంను ప్రత్యేకంగా ప్రశంసించారు. 18మంది ఉద్యోగులతో దశాబ్దాల క్రితం సిగ్నిటీ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించిన ఆయన ఇవ్వాళ వేలమంది సిబ్బందితో ప్రపంచస్థాయి సంస్థగా కోవాసెంట్‌ను తీర్చిదిద్దారని శ్రీధర్‌బాబు చెప్పారు. టెక్నాలజీ అంటే సిలికాన్ వ్యాలీ, ప్రపంచ ప్రొడక్షన్ సెంటర్‌గా చైనాలోని షెంజెన్, క్రమశిక్షణ, సుపరిపాలన కలిగిన దేశంగా సింగపూర్‌ల గురించి చెబుతారని, ఈ మూడు లక్షణాలు కలగలిసిన నగరంగా హైదరాబాద్ రూపొందుతోందని తెలిపారు. ఇక్కడి అనుకూల పర్యావరణం దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. ‘అత్యధిక సంఖ్యలో గ్లోబల్ సామర్థ్య కేంద్రాలున్న నగరంగా అగ్రస్థానంలో నిలిచింది.. ప్రపంచంలోని దిగ్గజ బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు జీసీసీిల ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి.. ఇది అత్యంత గర్వించదగ్గ అంశం’ అని అన్నారు. లైఫ్ సెన్సెస్ రంగంలో గణనీయ ప్రగతిని సాధించామని, దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో మూడోవంతు ఇక్కడే తయారవుతున్నాయని తెలిపారు. హెల్త్ కేర్ ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయని, ఇలాంటి ఎకోసిస్టం మరెక్కడా కనిపించదని అన్నారు. తమ ప్రభుత్వ దృఢ సంకల్పం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. కార్యక్రమంలో ఐటీ, ఇండస్ట్రీస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, యుకె డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ వయన్ ఓవేన్‌లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




