అర్ధరాత్రి భార్యాభర్తల హత్య

– ఇంద్రేశం మున్సిపాలిటీలో ఘటన

పటాన్ చెరు, ప్రజాతంత్ర, మార్చి 14: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీలో కలకలం రేగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాచ్‌మ‌న్ దంపతులను హత్య చేశారు. దొంగతనాలకు కేరాఫ్ గా మారిన ఈ ప్రాంతంలో బతుకుదెరువు కోసం వలస వచ్చిన బడుగుల ప్రాణాల్ని తీయడం పలు అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొంగచింత తండాకు చెందిన దరావత్ సోమ్లా(45), ధరావత్ మంగమ్మ (40) గా పోలీసులు గుర్తించారు. సోమ్లా మూడున్నర సంవత్సరాలుగా వెంకటే శ్వర రెడ్డి అనే బిల్డర్ దగ్గర పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకు టున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు.పెద్ద కూతురుకు పెళ్లి కాగా చిన్న కూతురు సానియా శనివారం పదవ తరగతి పరీక్ష రాస్తోంది. అయితే పరీక్ష రాసే వరకు తల్లిదండ్రుల హత్య సమాచారం ఆమెకు చెప్పలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు క్యూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలను సేకరిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని రామచంద్రాపురం ఏసిపి శ్రీనివాస్ కుమార్ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *