– పరిశీలించి సూచనలు చేసిన సిఎం రేవంత్
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్18: శాసనమండలి భవనం పనులు చివరిదశకు చేరాయి. పాత శాసనసభ భవనాన్ని అందంగా తీర్చి ముస్తాబు చేస్తున్నారు. దీంట్లో మండలి కార్యకలాపాలు జరుగనున్నాయి. దీంతో రెండు సభలు ఒకే ప్రాంగణంలోకి అందుబాటులోకి రానున్నాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలి మరమ్మతు పనులు పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. పనులను సక్షించిన సీఎం పలు సూచనలు చేశారు. తుదిదశకు చేరుకున్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు మండలిని జూబ్లీహాల్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో మండలికి వెళ్లాలంటే మంత్రులకు ఇబ్బందికరంగా మారింది. అలాగే ఏదైనా సమావేశం నిర్వహించేందుకు గతంలో జూబ్లీహాల్‌ను ఉపయోగించేవారు. తిరిగి దానిని పాతపద్దతిలో పునరుద్దరించే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ కార్యదర్శ నరసింహాచార్యులు పలువురు అధికారులు కూడా స్పీకర్ వెంట వచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





