బడ్జెట్ సమావేశాలనాటికి మండలి హాల్ సిద్ధం

– శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: శాసన మండలి హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అతి త్వరలో జరగనుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రాంగణలోని శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులను ఆయన మంగళవారం పర్యవేక్షించారు. శాసనమండలి సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు, ఆరఅండ్‌బీ, అగాఖాన్ సంస్థ, తదితర అధికారులతో కలిసి జరుగుతున్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలోనే నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. త్వరలోనే శాసనమండలి హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సూచించారని, ఇప్పటివరకు పూర్తి అయిన పనుల గురించి వఆరా తీశారని, బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ ఆవరణలో ఉన్న ఈ భవనంలోనే నిర్వహించాలని ఆదేశించారని వివరించారు. పనులలో వేగం పెంచాలని, త్వరగా భవనాన్ని పూర్తి చేసి శాసన మండలి అధికారులకు అప్పగించాలని సుఖేందర్ రెడ్డి ఆదేశించారు. ఆలస్యం చేస్తే కాంట్రాక్టు పనులు రద్దు చేస్తామని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *