రెండు బిల్లుల‌కు శాస‌న‌మండ‌లి ఏక‌గ్రీవ ఆమోదం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలంలోని జైన్ తిరుమలాపూర్ గ్రామం పేరును జయన్న తిరుమలాపూర్ గా మార్చే బిల్లును పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క శాసనమండలిలో సోమ‌వారం ప్రవేశపెట్టారు. అలాగే ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను తొలగిస్తూ పంచాయతీరాజ్ చట్టంలోని 21వ సెక్షన్ సవరణ బిల్లును కూడా మంత్రి సీత‌క్క శాసనమండలిలో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి గ‌తంలో ఆర్డినెన్స్ జారీ కాగా దానిస్థానంలో నేడు బిల్లు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బిల్లుల‌ను శ‌నివారం శాస‌న‌స‌భ ఆమోదించిన విష‌యం విదిత‌మే. చర్చలో ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, నెల్లికంటి సత్యం త‌దిత‌రులు పాల్గొన్నారు. చర్చ అనంతరం బిల్లును మండ‌లి ఏకగ్రీవంగా ఆమోదించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *