– చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని తెలంగాణ శాసన పరిషత్ భవనం (హెరిటేజ్ బిల్డింగ్) పునర్నిర్మాణ పనులను శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, పరిషత్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్ల్లేటివ్ కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి.నరసింహాచార్యులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదే సమయంలో హెరిటేజ్ భవనం అయినందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న సమావేశాలు ఈ భవనంలో నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులను పరిశీలించడానికి వస్తారని, పనులలో ఎలాంటి జాప్యం చేయకుండా వేగంగా పూర్తి చేసి శాసనమండలి అధికారులకు అప్పగించాలని సుఖేందర్ రెడ్డి ఆదేశించారు. అనంతరం ఆర్‌అండ్‌బి అధికారులు, అగాఖాన్ సంస్థ ప్రతినిధులతో అసెంబ్లీ స్పీకర్ చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



