– సభ నిరవధికంగా వాయిదా
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : బీసీలకు రిజర్వేషన్లను పెంచేందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ (మూడవ సవరణ) 2025 బిల్లును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శాసనమండలిలో సోమవారం ప్రవేశపెట్టారు. మొదటగా బీసీ బిల్లుపై చర్చించి శాసనమండలి ఆమోదం తెలిపింది. (ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టసవరణ, పురపాలక సంఘాల చట్టసవరణ, అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది.
బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన..
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనమండలిలో బీఆర్‌ఎస్ సభ్యులు గందరగోళం సృష్టించారు. చైర్మన్ పోడియం దగ్గర ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ చేస్తూ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు సహా మొత్తం నాలుగు బిల్లులను మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. కాగా, సభలో ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. జై తెలంగాణ నినాదాలు చేసే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదని, తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే తెలంగాణతో టీఆర్‌ఎస్ బంధం తెగిపోయిందని అన్నారు. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన టీఆర్‌ఎస్ తెలంగాణ మాట పలికే అర్హతను కోల్పోయిందన్నారు. ఇదిలా వుండగా పలు బిల్లుల ఆమోదం తర్వాత శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





