పత్తిని కేంద్రమే కొనుగోలు చేస్తుంది

 – సీసీఐ ద్వారా క్వింటాల్‌ ‌పత్తి రూ.8,110
– కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌17: ‌కేంద్ర ప్రభుత్వం పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. క్వింటాల్‌ ‌పత్తి రూ.8,110 ధరకు సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో పత్తి సాగు ఉత్పత్తి పెరుగుతోందని.. పత్తి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ముందు ఉందన్నారు. శుక్రవారం డియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వరితో పాటు అత్యధికంగా సాగవుతున్న పంట పత్తి అని.. రాష్ట్రంలో 45లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతోందని తెలిపారు. 22 లక్షలకు పైగా రైతులు పత్తిని పండిస్తున్నారన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కాటన్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందన్నారు. పత్తి రైతులు దళారుల చేతిలో పడి మోస పోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చివరి క్వింటాల్‌ ‌వరకు కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.  కొనుగోలు కేంద్రాలను మరో 12పెంచామని.. మొత్తం 122 కొనుగోలు కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపారు కేంద్రమంత్రి. పత్తి సాగు ఉత్పత్తిలో సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారు. తొమ్మిది ప్రాంతీయ భాషల్లో పత్తి సాగుకు సంబంధించి కిసాన్‌ ‌యాప్‌ను తీసుకొచ్చామని.. యాప్‌లో రైతులు నమోదు చేసుకుంటే.. స్లాట్‌ ‌ద్వారా పత్తిని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చని అన్నారు. పత్తి శుద్ధి, రవాణా కోసం జిన్నింగ్‌ ‌మిల్లులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. హై డెన్సిటీ ప్లాంటేషన్‌ ‌వల్ల పంట దిగుబడి డబుల్‌ అవుతుందని తెలిపారు. మహారాష్ట్ర అకోలా ప్రాంత ప్రజలు హై డెన్సిటీ ప్లాంటేషన్‌ ‌చేస్తున్నారని.. హై డెన్సిటీ ప్లాంటేషన్‌పై అవగాహన కోసం అవసరమైతే రైతులను మహారాష్ట్రకు తీసుకెళ్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి మన రైతులు హై డెన్సిటీ ప్లాంటేషన్‌చేసేలా పని చేస్తామన్నారు. కిసాన్‌ ‌యాప్‌ ‌దీపావళి నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పదేళ్లలో కనీస మద్దతు ధర వంద శాతం పెరిగిందన్నారు. నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని.. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ ‌పెట్టీ జైలుకు పంపుతున్నామని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page