– చెత్త, కాలుష్య నివారణ అతిపెద్ద టాస్క్
- చెత్త ఏరివేతకు వారానికి మూడ్రోజులు స్పెషల్ డ్రైవ్
- ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు
– నాలాలు, చెరువుల ఆక్రమణలు కాకుండా చూడాలి
– జనవరి నుంచి నాలాల పూడికతీత పనులు
– గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్‌కు మారాలి
– జోనల్ కమిషనర్లకు సిఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 30 : ఓఆర్‌ఆర్ లోపల ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కొత్త జోనల్ కమిషనర్లతో సమావేశమైన సీఎం.. వొచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలమెంట్ విభాగం అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో కొత్త జోనల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. క్యూర్ పరిధిలో సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా చేశాం. కోర్ అర్బన్ రీజియన్‌ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం. జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్‌లో ఉండాల్సిందే. జోన్ల వారీగా సమస్యలు పరిష్కరించే బాధ్యత కమిషనర్లదే అని స్పష్టం చేశారు. నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ. నెలకు 3 రోజులు పారిశుద్ధ్య పనుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేలా చర్యలు చేపట్టాలి. క్యూర్ పరిధిలో డీజీల్ బస్సులు, ఆటోల స్థానంలో విద్యుత్ వాహనాలు తీసుకురావాలి. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నరెన్స్‌కు మారాలి. జనవరి నుంచి నాలాల పూడికతీత పనులు చేపట్టాలి. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్కస్ విభాగాలు బాధ్యత తీసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశించారు. మంచి ఫలితాలు రాబట్టాలంటే ..జోనల్ కమిషనర్లు ప్రతీ రోజు ఫీల్డ్‌లో ఉండాల్సిందేనని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియాను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలనే తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నామని వ్యాఖ్యానించారు. క్యూర్ పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని చెప్పుకొచ్చారు. పరిపాలనను పట్టాలెక్కించాలనేదే తమ ఆలోచన అని తెలిపారు. హైదరాబాద్ నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ అని వివరించారు. కోర్ అర్బన్ రీజియన్‌ను ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. జోన్‌ల వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్‌లదేనని స్పష్టం చేశారు. సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన తీసుకుంటున్నామని వెల్లడించారు సీఎం రేవంత్‌రెడ్డి. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని దిశానిర్దేశంచేశారు.
రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, రోడ్లపై గుంతలు కనిపించొద్దని సూచించారు. జనన, మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువపత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని మార్గనిర్దేశం చేశారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్కస్ విభాగాలు నాలాల పూడిక తీత పనులు జనవరి నుంచి ప్రారంభించాలని నిర్దేశించారు. నగరంలో వీధి దీపాలు సరిపడా ఉండేలా చూసుకోవాలని సూచించారు. క్యూర్ ఏరియాలో ఆయా విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకుంటారని పేర్కొన్నారు. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌కు వీలైనంత స్పీడ్‌గా రెస్పాన్స్ అవ్వాలని మార్గనిర్దేశర చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని సూచించారు. అధికారులు అందరూ కలిసి పనిచేస్తేనే నగరం భవిష్యత్ బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





