– గద్దెల ప్రాంగణం పున:ప్రారంభంతో ఓ ఘట్టం ముగిసింది
– కేబినెట్ మీటింగ్‌ను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు
– పంచాయతీరాజ్ మంత్రి సీతక్క
మేడారం, ప్రజాతంత్ర, జనవరి 19: గద్దెల ప్రాంగణం పున:ప్రారంభంతో ఒక ఘట్టం ముగిసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మేడారంలోనీ హరిత హోటల్లో మంత్రి సీతక్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ తల్లుల కీర్తిని ప్రపంచానికి చాటేలా వార్తలు కవర్ చేసిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం మండ మెలిగే పండుగ ఉందని, ఆ రోజు నుంచి నిండు పండుగ వరకు ఇదే రకంగా విజయవంతం చేయాలని అందరికీ పిలుపునిచ్చారు. హైదరాబాదులో జరిగే కేబినెట్ సమావేశాన్ని అడవిలోకి తీసుకొచ్చి ఏర్పాటు చేశాము.. కేవలం కేబినెట్ సమావేశమే కాదు.. సీఎంగారి కుటుంబం, మంత్రుల కుటుంబాలు రాత్రి ఇక్కడ బస చేశాయి.. రెండు రోజులపాటు ఇక్కడ యావత్ కేబినెట్ ఉండడం, కేబినెట్ సమావేశాన్ని ఇక్కడే ఏర్పాటు చేసి పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ప్రకటించడం ములుగుకు గర్వకారణం అని అన్నారు. అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, హోంగార్డుల నుండి డీజీపీ వరకు కష్టపడి పనిచేసి మేడారంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశాన్ని, సీఎం పర్యటనను విజయవంతం చేశారని, నేడు గద్దెల ప్రాంగణ ప్రారంభోత్సవం, సీఎం, మంత్రుల దర్శనాల సందర్భంగా కూడా ఎలాంటి చిన్న లోపం లేకుండా విజయవంతం చేసిన జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమ్మక్క సారలమ్మ కీర్తి స్ఫూర్తిని నింపుకుని మహిళలు ఎన్నో విజయాలు సాధించేందుకు సీఎంతోపాటు పెద్ద ఎత్తున అమ్మల దర్శనాలు. చేయించామని సీతక్క అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





