హక్కులపై చైతన్యం కల్పించడమే ధ్యేయం

– వినియోగదారుల హక్కుల దినోత్స‌వంలో డాక్టర్‌ అనితా రెడ్డి

హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరిని అవగాహన పరచడమంటే కుటుంబాలను అవగాహనపరచడమేనని, తద్వారా సమాజాన్ని మోసాల బారినుండి కాపాడడమేనని కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ నేషనల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అండ్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ అనితారెడ్డి అన్నారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ప్రజలను చైతన్యపరిచి ఎవరూ మోసపోకుండా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. వరల్డ్‌ వైజ్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ అవగాహన కార్యక్రమాలు గ్రామస్ధాయి నుండి జిల్లా, రాష్ట్రస్థాయిలో చేపడుతున్నట్లు తెలిపారు. బయట తినే పదార్థాలలో జరిగే మోసాలు, వస్తువులను కొన్నప్పుడు ఎలా మోసపోతామో వివంరించారు. వస్తువు కొన్నప్పుడు బిల్లు, గ్యారంటీ కార్డు, వారంటీలను తీసుకోవాలని, మనకు ఏవైనా ఇబ్బందులెదురైనప్పుడు కేసు వేయడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యంగా పిల్లలకు, గ్రామీణవాసులకు వినియోగదారుల చట్టంపై అవగాహన కల్పిస్తామని, ఎవరైనా మోసపోతే వినియోగదారుల కోర్టు ద్వారా వారు ఎలా బయటపడాలో తెలియచేస్తామని అన్నారు. చట్టానికి వియోగదారులకు వారధిగా వరల్డ్‌ వైజ్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఉంటుందని డాక్టర్‌ అనిత తెలిపారు. ప్రభుత్వ చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే వాటిని ప్రజలు వినియోగించుకుంటారన్నారు. వరల్డ్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కేసులు దాఖలు చేసే విధానం గురించి, చట్టం గురించి వినియోగ దారులకు అవగాహన కల్పించడం, వారికి కోర్టులో ప్రాతినిధ్యం కల్పించడం వంటి బాధ్యతలను వరల్డ్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ నిర్వహిస్తుందని ఆమె తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, అపార్టుమెంట్లలో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. వినియోగదారులు మోసపోకుండా చూడడం ప్రభుత్వంతోపాటు అందరి భాధ్యత, లక్ష్యం కావాలని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *