– అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి
హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: ప్రభుత్వం రూపొందించిన చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలని వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్మన్ అండ్ అడ్వైజర్, అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. ఆమె అధ్యక్షతన ప్రభుత్వ బాలుర హాస్టల్ స్పందన ఆశ్రమంలో పిల్లల తల్లిదండ్రులకు, సిబ్బందికి కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ చట్టం -2019పై అవగాహన కల్పించారు. 1986 డిసెంబర్ 24న కన్ప్యూమర్స్ చట్టాన్ని తెచ్చారని, వినియోగదారుల హక్కులకు చట్టపరంగా రక్షణ కోసం ప్రత్యేకంగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ను ప్రభుత్వం తీసుకొచ్చిందని, కానీ దీనిపై చాలామందికి అవగాహన లేదని అన్నారు. ప్రతి కొనుగోలు లావాదేవీ చేసినప్పుడు వినియోగదారులు బిల్లులను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వారంటీ, గ్యారెంటీ ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు ఇన్వాయిస్, ఇతర బిల్లులను చూపించాల్సి ఉంటుందని, కొనుగోలు చేసిన వస్తు సేవల్లో లోపాలు ఉన్నప్పుడు వాటిద్వారా పరిహారాన్ని కోరే అవకాశం వినియోగదారులకు ఉంటుందని ఆమె తెలిపారు. యాక్ట్ -2019 ప్రకారం కేసులు దాఖలు చేసే విధానం గురించి, చట్టం గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం, వారికి కోర్టులో ప్రాతినిధ్యం కల్పించడం వంటి బాధ్యతలను వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ నిర్వహిస్తుందని, వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తు సేవల వల్ల కలిగే నష్టాలకు పరిహారాన్ని కోరవచ్చంటూ డాక్టర్ అనితా రెడ్డి వివరించారు. రైతులు మందులు, ఎరువులు, విత్తనాలను ఎలా చట్ట ప్రకారం కొనాలి, మోసపోతే ఎలా వినియోగదారుల చట్టం వినియోగించుకోవాలో అవగాహన సదస్సులు ఇకపై కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామస్ధాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని. పాఠశాలలు, కళాశాలల్లో, అపార్టుమెంట్లలో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు, చట్టానికి వారధిగా ప్రపంచవ్యాప్తంగా క్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ పనిచేసి వినియోగదారులు మోసపోకుండా చేయడమే లక్ష్యమని అనితారెడ్డి చెప్పారు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా తమని సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో సుచరిత, వసుధ, హరిత, దీప, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





