– ఘటనకు మంత్రులదే బాధ్యత
– ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: మేడారం గద్దెల వద్ద గతనెల 25న జరిగిన ప్రమాదానికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. హన్మకొండలో ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమ్మక్క పూజారి కుమారుడు యువన్‌ను వారు పరామర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బాలుడికి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. మంత్రి సీతక్క వచ్చి పరామర్శించి రూ. 10వేలు చేతిలో పెట్టి వెళ్లి ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆరోపించారు. బాలుడిని ఆదుకునేందుకు ఇప్పటివరకు మంత్రులు ముందుకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడికి అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించి, అతడి భవిష్యత్ కోసం కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బాధితుడి తల్లిదండ్రులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. వీరివెంట ఎట్టి జగదీష్, మాజీ జడ్పీటీసీ రామాసహాయం శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఈసం రామ్మూర్తి, కేయూ బీఆర్‌ఎస్వీ నాయకుడు కొనుకంటి ప్రశాంత్, తాడ్వాయి మండల యూత్ అధ్యక్షుడు కోట సురేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.