కుట్రపూరిత చర్యలతోనే ఎంజిబిఎస్‌ ‌మునక

– వరద ప్రమాదం ఉన్నా వొదలని జంటజలాశయాల నీరు
– పరివాహక ప్రజలను భయానికి గురిచేసేందుకు గేట్లు ఎత్తివేత

– మీడియా సమావేశంలో ‌కెటిఆర్‌ ‌విమర్శలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 27: ‌సీఎం రేవంత్‌రెడ్డి పథకం ప్రకారమే ఎంజీబీఎస్‌ను ముంచారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌కేటీఆర్‌ ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కోసమే సీఎం కిరాతకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద హెచ్చరికలు ఉన్నా జలాశయాల నుంచి నీరు విడుదల చేయలేదని, ఉద్దేశపూర్వకంగానే జంట జలాశయాల నుంచి నీరు వదల్లేదని ఆక్షేపించారు. మూసీ ప్రాంత వాసులను భయపెట్టేందుకే ఒకేసారి 15 గేట్లు తెరిచారని విమర్శించారు. ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎంజీ బస్టాండ్‌ ఎం‌దుకు మునిగిందని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. ఇకపోతే ఏ వర్గానికి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎంత బాకీ పడ్డదో రేవంత్‌ ‌సర్కార్‌ను నిలదీసి అడిగేందుకే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేశామని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రస్థాయి నాయకుల నుండి క్షేత్రస్థాయి నాయకుల వరకు అందరం ప్రతి ఇంటికి ఈ బాకీ కార్డులను తీసుకెళ్లి ఇస్తామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ ‌బాకీ కార్డు విడుదల చేసిన సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడారు. కాంగ్రెస్‌ ‌మోసాలను ఎండగట్టి, ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ బాకీ కార్డుల ద్వారా వినూత్న నిరసన కార్యక్రమం, ప్రచారం చేపట్టినట్లు పేర్కొన్నారు. 100 రోజులు కాదు 700 రోజులైనా హాలు అమలు చేయడం లేదు. వివిధ వర్గాలకు ఎంత బాకీ ఉన్నారో ఇందులో వివరించాం. 8 లక్షల పెండ్లిలు అయ్యాయి.. ఇప్పటి వరకు తులం బంగారం జాడనే లేదు. తొలి కేబినెట్‌ ‌సమావేశంలోనే దీనిపై హా చట్టం తెస్తామన్నారు. కానీ ఆ ఊసే లేదన్నారు కేటీఆర్‌.అం‌గ వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయింది అన్నట్టు పాలన ఉందన్నారు. రైతులకు రైతుబంధు, రుణమాఫీ లేదు. కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, ఆటో అన్నలకు దాదాపు రూ.24 వేలు, మహిళలకు నెలకు రూ.2500.. పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం, వృద్ధులకు నెలకు రూ.4 వేలు, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బాకీ పడిందన్నారు.చాలా మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌ ఇవ్వడం లేదు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు.. ఉద్యమకారులకు 250 చ.గజాల స్థలం జాడే లేదు. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఊసే లేదు. ఇలా రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు ఈ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పడిన బాకీని తెలుపుతాం. మా మీద కేసులు పెట్టిన భయపడం అని కేటీఆర్‌ ‌చెప్పారు.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *