హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రముఖ ఆర్థికవేత్త అర్వింద్ సుబ్రమణియన్ సోమవారం భేటీ అయ్యారు. విద్యుత్ రంగం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ అంశాలపై ఆయనతో సీఎం, డిప్యూటీ సీఎం భట్టిలు చర్చించారు. విద్యుత్ రంగంలో ఖర్చుల నమూనా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగంలో నమూనా మూల్యాంకనం, జీఎస్టీలో పన్నుల అంచనా, ఇతర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సుబ్రమణియన్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటూ పలు కీలక సూచనలు చేశారు. భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రిని కలిసిన తిలక్ వర్మ 
టి-20 ప్రపంచ కప్-2026 గెలుచుకుని హైదరాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా టీమ్ ఇండియా ఆటగాడు తిలక్ వర్మ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి సీఎం అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, సాట్-జి చైర్మన్ శివసేనారెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




