ప్రలోభాలతోనే కాంగ్రెస్ విజయం

» అభివృద్ధిని చూసి బీహార్ ప్రజల తీర్పు
» బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: బిహార్ ఎన్నికల ఫలితాలు మన భవితరాల ఆలోచనలు ఏ దిశలో ఉన్నా యో ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామ్ చందర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన విలేక ర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, నేపాల్లో జెన్జెడ్ త రం అల్లర్లు సృష్టించినట్టుగా, ఎన్నికల కమిషన్ను తగలబె డతామని బెదిరించినా బిహార్‌ ప్రజలు ఎన్డీయేకు బంపర్‌ మెజారిటీ ఇచ్చారు. కేవలం అభివృద్ధిని చూసి, డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ పాలనపై విశ్వాసంతో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. కాంగ్రెస్‌ కూటమిలోని ముఖ్య నాయకులు ఓడిపోవడం, కాంగ్రెస్‌ కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడం ప్రజలు వారిని ఏ మాత్రం నమ్మలేదనడానికి నిదర్శనమన్నారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు, పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్‌ది గెలుపు కాదు.. అది నిజానికి ఎంఐఎంకి ఇచ్చిన తీర్పు. గతంలో గెలిచిన అభ్యర్థి ఎంఐఎం నుండి పోటీ చేయగా అది బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీటు అయినప్పటికీ తాము గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించామన్నారు. కానీ బీఆర్‌ఎస్‌ ఓడిపోయినా ఇప్పటికీి తమదే అధికారం అని చెప్పుకుంటోందన్నారు. ఇది ప్రజల తీర్పు కాదు.. డబ్బు, అధికారం, ప్రలోభాలతో కాంగ్రెస్‌ అక్కడ గెలిచిందన్నారు. కానీ, గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్‌ కూడా రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వార్డు మెంబర్‌ కూడా లేని త్రిపురలో ఈ రోజు బీజేపీ అధికారం చేపట్టిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయం మారుతుంది, తప్పకుండా డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తుంది. తాము ప్రజా వంచన పార్టీ అయిన కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడతాం. రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయం అవుతుంది అని రామచందర్‌రావు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page