– అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది
– బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత ఆరోపణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో ఉప ఎన్నిక జరిగిందని బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది అని అభివర్ణించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందిన నేపథ్యంలో సునీత స్పందించారు. ప్రజలను భయపెట్టి వోట్లు వేయించుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసి గెలిచిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం (ఈసీ) విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ది అసలు గెలుపే కాదని.. నైతికంగా తానే గెలిచానని సునీత స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలో సైతం కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని వెల్లడించిన విషయం విదితమే. దీంతో ఓటమి చెందిన సునీత అధికార కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





