కాంగ్రెస్ 75 శాతానికి పైగా స్థానాలు గెలుస్తుంది

– మంత్రి దామోదర్ రాజనర్సింహ

రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి6: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడు తున్న క్రమంలో ప్రచారాన్ని ముమ్మరం చేశా యి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచా రంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సిం హ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ 75 శాతానికి పైగా స్థానాలు గెలుస్తుందని అన్నారు. ప్రచారంలో అమ్మా.. బాగున్నారా.. మా పాలన ఎలా ఉంది.. పథకా లు అందుతున్నాయా.. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. అంటూ… వోటర్లను మంత్రి దామోదర రాజనర్సింహ పలకరించారు. 14వ వార్డు అభ్యర్థి అందెమోహన్ తరపున ఇంటింటి ప్రచారానికి వచ్చిన ఆయన స్థానిక భవాని మాత ఆలయం దగ్గర రచ్చబండ ఏర్పాటు చేసి మహిళలతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పలువీధుల్లో తిరిగి కాంగ్రెస్ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తమ అభ్యర్థి అందెమోహన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దామోదర రాజనర్సింహ. అనంతరం డియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 75 శాతానికి పైగా గెలుస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు. సీఎం పని తీరుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాజనర్సింహ అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *