– రెండేళ్ల పాలనపై ఇది స్పష్టమైన ప్రజాతీర్పు
– కాంగ్రెస్ కి ఘన విజయం అందించిన ప్రజానీకానికి కృతజ్ఞతలు
– విజేతలకు అభినందనలు
– మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం.తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ఇందిరమ్మ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు.పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు.. ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ విజయం కొనసాగింది. గ్రామీణ ప్రాంతాలే కాదు, పట్టణ ప్రజలు కూడా ప్రభుత్వ పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నారని మున్సిపల్ ఫలితాలు రుజువు చేశాయి. ఈ ఎన్నికలు రెండేళ్ల ప్రభుత్వ పనితీరుకు రిఫరెండమ్ అని నేను వ్యక్తిగతంగా ముందుగానే ప్రకటించాను. ఫలితాలు కూడా అదేవిధంగా ఉన్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడం వారి వైఫల్యానికి నిదర్శనం.కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రతిపక్షాల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు.ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన నిలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరిచారు.ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ప్రజా ప్రభుత్వంపై అపార విశ్వాసం ఉంచి రికార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన ప్రజానీకానికి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలోనూ ఇదే ప్రజాతీర్పు పునరావృతమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




