కాంగ్రెస్ . . బిజెపి ..మధ్యలో కవిత ..?

“రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలన్న ఉద్దేశం  కాంగ్రెస్ కు బీజేపీ కి మాత్రమే ఉంది..ఆ రెండు పార్టీలతో బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది..ఈ పోరాటంలో హరీష్ రావు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు.. కేసీఆర్ ను కొట్టాలంటే ముందు కేసీఆర్ చుట్టూ బలంగా నిలబడ్డ వారిని దూరం చేసివారిని రాజకీయంగా కనుమరుగు చేసి కేసీఆర్ ను ఒంటరి చేయాలన్న ఎజెండాను అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి..కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బకొట్టి లొంగదీసుకోవడం కాంగ్రెస్ కంటే బీజేపీకి చాలా ముఖ్యం..అదే సమయంలో కవిత వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ ను బీజేపీకి దగ్గర చేసేలా కనిపిస్తున్నాయి..మరోవైపు కవిత వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్..రేవంత్ రెడ్డి ఉన్నాడని బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి..అయితే కవిత వెనుక రేవంత్ రెడ్డి, మోషాలు ఉన్నారన్న  అనుమానం తెలంగాణ సమాజంలో ఉంది.”  
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ బిడ్డ కవిత రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..సొంత పార్టీపై, సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు ఆరోపణలు చేస్తూ చర్చనీయంశంగా మారింది.బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూనే..కేసీఆర్ దేవుడంటూనే పార్టీకి చేయాల్సిన డ్యామేజ్ చేస్తుంది..ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకులపై విమర్శలు చేస్తున్నారు..బీఆర్ఎస్ 25 ఏళ్ళ రజతోత్సవ సభ తర్వాత మరింత దూకుడు పెంచింది..సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.బీఆర్ఎస్ లో కేసీఆర్ ను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ మొదలు పెట్టి ఇప్పుడు ఏకంగా పార్టీలో చాలా ముఖ్యమైన నేతగా, కేసీఆర్ అత్యంత సన్నిహితుల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండే హరీష్ రావు ను తాజాగా కవిత టార్గెట్ చేసింది.
Will the warangal meetig give strength to the BRS?

మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు కేసీఆర్ ను తప్పుదోవ పట్టిస్తున్నాంటూ ఆరోపణలు చేసింది.. అంతే కాదు ఒక అడుగు ముందుకేసి వాళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి కోవర్టులంబూ బాంబు పేల్చింది..జైలు నుంచి వచ్చినప్పటికీ నుంచే సంతోష్, హరీష్ రావును కవిత టార్గెట్ చేసింది. పరోక్షంగా వారిపై అనేక విమర్శలు చేసింది..కవిత వల్ల ఇబ్బందులు పడ్డ హరీష్ రావు ఒకానొక టైం లో పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు అన్న వార్తలు వచ్చాయి..అయితే కేసీఆర్, కేటీఆర్ చర్చలతో వివాదం సద్దుమణిగింది. కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్ళి వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలకు చెక్ పెట్టారు.ఇది కవితను మరింత ఆగ్రహానికి గురిచేసింది.. దీంతో డైరెక్ట్ పార్టీ పైన, కేటీఆర్, హరీష్ రావు , సంతోష్ రావు సహా ఇతర ముఖ్య నాయకులపై విమర్శలు పెంచింది.మొదట కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ నిజామాబాద్ జిల్లా నేతపై ఆరోపణలు చేసింది..ఆ తర్వాత జగదీష్ రెడ్డిని లిల్లిపుట్టు నాయకుడంటూ మాట్లాడింది.. కార్తీక్ రెడ్డి పై, ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి వెన్నెముక గా..కేసీఆర్ కు రైట్ హ్యాండ్ గా ఉంటున్న హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది.

హరీష్ రావు, సంతోష్ రేవంత్ రెడ్డి కోవర్ట్ లంటూ.. కాళేశ్వరం కేసుపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడానికి హరీష్ రావు, సంతోష్ కారణమంటూ ఆరోపించింది..ఫామ్ హౌస్ దెయ్యాలు వీల్లే అంటూ విమర్శలు చేసింది.. నిజానికి కేసీఆర్ కు అతి దగ్గరగా ఉంటూ బీఆర్ఎస్ ను బతికిస్తున్న వారిపై కవిత ఒక పద్ధతి ప్రకారం. స్పష్టమైన ఎజెండాతో ఆరోపణలు చేస్తున్నారు.. కేసీఆర్ తనను పిలిచి మాట్లాడే వరకూ పార్టీకి నష్టం చేసే అజెండాతో కవిత రాజకీయ ప్రకటనలు చేస్తున్నట్లుంది. నిజానికి తెలంగాణ ఉద్యమం, అంతకు ముందునుంచే హరీష్ రావు, సంతోష్ తో కేసీఆర్ ఉంటున్నారు..కవిత, కేటీఆర్ కేసీఆర్ తో లేనప్పుడే హరీష్ రావు కేసీఆర్ తో ఉన్నారు..రాముడికి హన్మంతుడిలా వ్యవహరిస్తున్నారు..అర్జునిడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తే.. కేసీఆర్ ఉద్యమ రథాన్ని కృష్ణుడి హరీష్ రావు నడిపారు.. అందుకే కవిత కంటే కేసీఆర్ హరీష్ రావునే ఎక్కువ నమ్ముతారని పార్టీ నేతలు చెబుతారు..

కవిత తన అజ్ఞానంతో బీఆర్ఎస్ పార్టీలోని ఉద్యమకారులను అవమానిస్తుంది.. జగదీష్ రెడ్డి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రశ్నించింది.. ఇప్పుడు హరీష్ రావు విషయంలో కూడా అదే విధంగా మాట్లాడుతుంది.కేసీఆర్ పేరును అడ్డుపెట్టుకుని పేరు ప్రఖ్యాతులు పొందారంటూ ఆరోపణలు చేస్తున్నారు..నిజానికి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ తో సమానంగా జగదీష్ రెడ్డి, హరీష్ రావు నడిచారు. కవిత, కేటీఆర్ అమెరికా నుండి వచ్చే వరకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి లు కృష్ణార్జునుల్లా కేసీఆర్ తో నడిచారు..ఈ రోజు కవిత హరీష్ రావు, జగదీష్ రెడ్డిలను అవమానిస్తుందే.. కేసీఆర్ ను కూడా అవమానించినట్లే అవుతుంది. కేసీఆర్ ఒక్కరే తెలంగాణ తేలేదు..వేల మంది త్యాగాలు, కోట్ల మంది ప్రజా పోరాటం ఉంది.. పోరాటంలో కేసీఆర్ ముందుంటే హరీష్ రావు లాంటి అనేక మంది ఉద్యమకారులున్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ ఉద్యమం రాలేదు.. తెలంగాణ ఉద్యమం వల్లే కేసీఆర్ కు పేరు వచ్చింది..ఆ క్రమంలో హరీష్ రావు లాంటి లీడర్స్ కు పేరువచ్చింది.

అసంబద్ధమైన , అర్థ సత్యాలతో నిలకడ లేని విమర్శలు, సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ కవిత కూడా తెలంగాణ రాజకీయాల్లో స్పష్టతలేని నాయకురాలిగా స్థిరపడవచ్చన్న చర్చ పొలిటికల్ చౌరస్తాలో వినిపిస్తోంది. నిజానికి కవిత గొప్ప వక్త..ఇష్యూల పై పట్టుంది..భాషా ప్రావీణ్యంతో ప్రజలను ఆకట్టుకుంటుంది. కేసీఆర్ బిడ్డగా గుర్తింపు ఉంది..కానీ రాజకీయాలలో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటారని తన వ్యవహార శైలితో నిరూపించుకుంది..ఈ రోజు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో నిటారుగా నిలబడిందంటే కేసీఆర్ వ్యూహాలు.హరీష్ రావు అమలు చేసిన తీరే కారణం.అలాంటి హరీష్ రావుపై కవిత విమర్శలు చేయడం అంటే..కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బతీయడమే కాదు తనకు తాను రాజకీయంగా దెబ్బతీసుకోవడమే అవుతుంది..విదేశాలనుంచి తిరిగి వచ్చిన ప్రతి సారి విమర్శలు చేయడం.. అందులోనూ కేసీఆర్ కు అత్యంత దగ్గరగా ఉండే వారిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడం వల్ల కవిత తన స్థాయిని తానే దిగజార్చుకుంటుంది. నిజానికి కవిత బీఆర్ఎస్ పార్టీలో ఎవరిపై విమర్శలు చేసిన పెద్దగా నష్టం ఉండదు..కానీ పార్టీని భుజాలపై మోస్తున్న హరీష్ రావు లాంటి నేతలపై ఆరోపణలు చేయడం వల్ల కేసీఆర్ కే కాదు కవితకు కు రాజకీయంగా నష్టం చేస్తుంది.. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత అంతటి ప్రజాధారణ ఉన్న నేతల్లో హరీష్ రావు ముందుంటారు..కేసీఆర్ బిడ్డ అన్న గుర్తింపు పొందిన కవిత కంటే తెలంగాణలో హరీష్ రావుకు మంచి పేరుంది.

అయితే ప్రత్యార్థుల కంటే బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేయడంలో కవిత వ్యూహామేంటని ప్రశ్నలు వస్తున్నాయి. కవిత టార్గెట్ కేసీఆర్ చుట్టూ ఉన్న హరీష్ రావు, సంతోష్, జగదీష్ రెడ్డి వంటి నేతలే కాదు అంతకు మించి ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. కేసీఆర్ చుట్టున్న దెయ్యాలే కవిత లక్ష్యం అయితే పార్టీ ఫోరమ్ లో, కేసీఆర్ తో డైరెక్ట్ చర్చించవచ్చు.. ఎలాగూ అందరూ ఒకే కుటుంబం కాబట్టి కూర్చోని మాట్లాడుకోవచ్చు..కానీ కవిత అలా చేసిందా.. చేస్తే కేసీఆర్ కవితను నమ్మలేదా.. పార్టీకి కవిత వల్ల నష్టం అని దూరం పెట్టారా..ఈ ప్రశ్నలన్నిటికీ కేసీఆర్ మాత్రమే సమాధానం చెప్పగలరు.. కేసీఆర్ బయటకు వచ్చేలా లేరు ప్రజల సమాధానం దొరికేలా లేదు.

అయితే కవిత వరుస ఆరోపణల వెనుక మొదట్లో కేసీఆర్ ఉన్నారన్న వార్తలు వచ్చాయి.. పార్టీలో కొంత మంది నేతలను కంట్రోల్ లో పెట్టడానికి కేసీఆర్ కవితతో మాట్లాడిస్తున్నారన్న గుసగుసలు వినిపించాయి..కానీ కవిత ఆరోపణల వెనుక ఏదో బలమైన కారణం, బలమైన శక్తి ఉందన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది..రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలన్న ఉద్దేశం కాంగ్రెస్ కు బీజేపీ కి మాత్రమే ఉంది..ఆ రెండు పార్టీలతో బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది..ఈ పోరాటంలో హరీష్ రావు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు.. కేసీఆర్ ను కొట్టాలంటే ముందు కేసీఆర్ చుట్టూ బలంగా నిలబడ్డ వారిని దూరం చేసివారిని రాజకీయంగా కనుమరుగు చేసి కేసీఆర్ ను ఒంటరి చేయాలన్న ఎజెండాను అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి..కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బకొట్టి లొంగదీసుకోవడం కాంగ్రెస్ కంటే బీజేపీకి చాలా ముఖ్యం..అదే సమయంలో కవిత వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ ను బీజేపీకి దగ్గర చేసేలా కనిపిస్తున్నాయి..మరోవైపు కవిత వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్..రేవంత్ రెడ్డి ఉన్నాడని బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి..అయితే కవిత వెనుక రేవంత్ రెడ్డి, మోషాలు ఉన్నారన్న అనుమానం తెలంగాణ సమాజంలో ఉంది. కవిత ఎపిసోడ్ పై కేసీఆర్ ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే అది పార్టీకి, నమ్మకంగా ఉన్న నేతలకు చివరికి కవితకు కూడా నష్టం జరుగుతుంది.

-తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *