కాంగ్రెస్‌ విజయోత్సవ ర్యాలీలో విషాదం

– సర్పంచ్‌ కారు కిందపడి బాలిక మృతి
– హాస్పిటల్‌ వద్ద బంధువుల ఆందోళన

వికారాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: వికారాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ సర్పంచ్‌ విజయోత్సవ ర్యాలీలో విషాదం నెలకొంది. పోడూరు మండలం రాకంచర్ల గ్రామంలో కాంగ్రెస్‌ సర్పంచ్‌ కవ్లిూబాయ్‌ నిర్వహించిన ర్యాలీలో ఏడేళ్ల చిన్నారిపై నుంచి కారు వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక దుర్మరణం చెందింది. సర్పంచ్‌ల ప్రమాణస్వీకరం సోమవారం పూర్తి కావడంతో రాకంచర్లలో కాంగ్రెస్‌ సర్పంచ్‌ కవ్లిూబాయ్‌ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనుమ‌తి లేకున్నా డీజేతో ర్యాలీ నిర్వ‌హించారు. ఆ ర్యాలీని చూస్తున్న సమయంలోనే ఏడేళ్ల చిన్నారి కుర్వా సౌజన్యపై నుంచి సర్పంచ్‌ కారు వెళ్లింది. కారు చక్రాల కింద నలిగి తీవ్ర గాయాలు కావడంతో బాలికను హుటాహుటిన పరిగి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బాలిక మృతితో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో సర్పంచ్‌ కారు కింద పడటంతోనే తన కూతురు మరణించిందని బాలిక తండ్రితోపాటు గ్రామస్తులు ఆరోపించారు. కానీ బాలిక కారు కింద పడలేదని సర్పంచ్‌ భర్త పెంటయ్య వాదించారు. దీంతో హాస్పిటల్‌ ముందు బాధిత కుటుంబ సభ్యులు, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడకు వచ్చిన పోలీసులు ఇరువర్గాలను సముదాయించి పంపించేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *