– తొలి విడత ఎన్నికలు పాలేరు నియోజకవర్గంలో
– బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేశాం
– మంత్రి పొంగులేటి
– బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేశాం
– మంత్రి పొంగులేటి
కూసుమంచి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: తొలివిడత స్థానిక ఎన్నికల నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. కూసుమంచిలోని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలాల వారీగా సోమవారం ఆయన పార్టీ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీఓ జారీ చేసి ఎన్నికలకు సిద్ధమైందన్నారు. గడిచిన 21 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని ఆయన గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు ఇలా గ్రామాలన్నింటికీ చేరాయని వివరించారు. “ఈ పథకాలు అభ్యర్థుల విజయానికి ప్రధాన బలం అవుతాయి” అని అన్నారు.గ్రామాల్లో విభేదాలు ఉన్నా వాటిని చర్చల ద్వారా పరిష్కరించి ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కోసం ప్రతి మండలానికి తొమ్మిది మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఒకే గ్రామం నుండి అనేక మంది ఆశావహులు ఉన్నప్పుడు గెలుపు అవకాశాలు, పార్టీపై విధేయతను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. రిజర్వేషన్ల కారణంగా పోటీకి దూరమైన వారికి వేరే అవకాశాలు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవు” అని మంత్రి పొంగులేటి హెచ్చరించారు.
———————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





