25 నుంచి 30వేల మెజార్టీతో గెలుస్తున్నాం
బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ ఖేల్ ఖతం: మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల,ప్రజాతంత్ర,నవంబర్12: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25 నుంచి 30 వేల వోట్ల మెజార్టీతో గెలవబోతున్నారని.. ఈ ఎన్నికలో హస్తం పార్టీ విజయంతో కేటీఆర్ పని ఖతం కానుందని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ప్రజలు అండగా నిలిచారని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్‌లోనూ కాంగ్రెస్సే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. మంచిర్యాల జిల్లా భీమరం మండలం గొల్లవాగు ప్రాజెక్ట్ లో చేప పిల్లలను వదిలారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ’రెండు నెలలుగా జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఇన్‌చార్జులుగా నేను, సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు, డివిజన్లు, బూత్ లీడర్లు, కార్పొరేషన్ చైర్మన్లు చాలా శ్రమించాం. రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాం. జూబ్లీహిల్స్ లోనూ మత్యకారులు కాంగ్రెక్ పార్టీకి మద్దతు ఇచ్చారు. నూరు శాతం రాయితీపై రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో ఉచితంగా చేప పిల్లలు వేస్తున్నం. చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటు చేస్త. గొల్లవాగు ప్రాజెక్టును మా నాన్న కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి హయాంలో కట్టారు’ అని వివేక్ గుర్తుచేశారు.75 మార్కులు వచ్చిన విద్యార్థులకు తమ అంబేద్కర్ కాలేజీలో ఉచితంగా సీటు ఇస్తామని, ఇందుకు గానూ రూ.80 లక్షల వరకు ఖర్చు చేసినట్లు మంత్రి వివేక్? తెలిపారు. విశాఖ ట్రస్ట్ నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో రూ.2.5 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలిక జూనియర్ కాలేజీ నూతన భవనాన్ని కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా వివేక్ విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగించాలి సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం టీచర్ల కొరత లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక 51 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. తాను చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిలో మొదటగా విద్యకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఎక్కడ సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే నిధులు మంజూరు చేయిస్తానని హా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





