బిసి రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ది

– బిఆర్‌ఎస్‌ ఎం‌త తక్కువగా మాట్లాడితే అంతమంచిది
– మంత్రి కోమటిరెడ్డి హితవు

నల్లగొండ,ప్రజాతంత్ర,జూలై 12: బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమదేననని, పేదల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డ అన్నారు. ఇంతకాలం మాటలు చెప్పిన బిఆర్‌ఎస్‌ ‌బిసి రిజర్వేషన్లు ఎందుకు తేలేదని అన్నారు. ఈ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ ‌వారు మాటలు చెప్పడం మానాలని అన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌కు అండగా ఉండాలని కోరారు.  నల్లగొండ జిల్లా దండంపల్లి లో రూ. 8 కోట్ల  వ్యయంతో ఆటోమేటెడ్‌ ‌టెస్టింగ్‌ ‌స్టేషన్‌ ‌భవన నిర్మాణానికి మంత్రులు పొన్నం ప్రభాకర్‌,‌కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రవాణా శాఖ నుంచి  ఏ అవసరమున్న నల్గొండ జిల్లాకు  అధిక నిధులు ఇవ్వాలన్నారు.బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగిందన్నారు.  ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని చెప్పారు. రూ.6 వేల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో పొన్నం ప్రభాకర్‌ ‌కేబినెట్‌ ‌లో కొట్లాడరని చెప్పారు. బీసీ రిజర్వేషన్‌  ‌కాంగ్రెస్‌ ‌చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *