మున్సిపల్ ఎన్నికల్లో హ‌స్తం హవా!

– కాంగ్రెస్‌కు 68-76 మున్సిపాలిటీలు
– బీఆర్ఎస్‌కు 29-36 మున్సిపాలిటీలు
– బీజేపీకి 3-5 మున్సిప‌ల్ స్థానాలు
– మూడు కార్పొరేష‌న్ల‌లో కింగ్‌మేక‌ర్‌గా ఎంఐఎం
– పీపుల్స్ స‌ర్వే అంచ‌నా

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 11: రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు బుధ‌వారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. వివ‌రాలిలావున్నాయి. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబుబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కొన‌సాగుతోంది. కరీంనగర్, నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయ‌ని అంచ‌నా వేసింది. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. నిజమాబాద్, కరీంనగర్, మహబుబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్ మేకర్ కానుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు లేవ‌ని స్ప‌ష్టం చేసింది. రామగుండంలో కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.మంచిర్యాలలో కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-9, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ 28-34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14-16, ఇతరులు 2-4 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. మహబుబ్ నగర్ లో కాంగ్రెస్ 26-30, బీఆర్ఎస్ 18-22, బీజేపీ 6-8, ఎంఐఎం 2-4, ఇతరులు 0-1 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. నల్లగొండలో కాంగ్రెస్ 21-26, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-10, ఎంఐఎం 2-4, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. నిజమాబాద్ లో కాంగ్రెస్ 10-16, బీఆర్ఎస్ 2-4, బీజేపీ 26-31, ఎంఐఎం 8-12, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. కరీంనగర్ లో కాంగ్రెస్ 14-16, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 24-29, ఎంఐఎం 6-9, ఇతరులు 1-3 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.  మొత్తం మీద 68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-5 బీజేపీ, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉంది.  8 నుంచి 14 మున్సిపాలిటీల్లో ‘నువ్వా నేనా?’ అన్నట్టు పోటీ ఉంది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 1210-1290, బీఆర్ఎస్ 860-930, బీజేపీ 250-270, ఏఐఎంఐఎం 35-44, సీపీఐ 12-17, సీపీఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలుపొందే అవకాశం ఉంద‌ని పీపుల్స్ స‌ర్వే అంచ‌నా వేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *