– నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8: కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పునాదుల మీద ఏర్పడిరదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తమ పార్టీ పనిచేస్తున్నదని అన్నారు. ఈ సమాజం కోసం పనిచేస్తున్న ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు క్రైస్తవ ప్రతినిధులు సమావేశం కావడం శుభ పరిణామమన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించేందుకు ఇక్కడకు వచ్చిన పాస్టర్లకు, క్రైస్తవ సంఘ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్త్తీ ఉన్నతస్థాయికి ఎదిగేందుకు, వారిని ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అజేయంగా నిలవాలని ప్రార్థనలు చేయడంతోపాటు ఆశీస్సులు అందిస్తున్నారని అయన చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అధిక మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఆయన గెలుపు కోసం మీ ప్రార్థనా మందిరాలలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి నాయకత్వంలోని ఈ కేబినెట్ మొత్తం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ సమాజ హితం కోసం ప్రజా ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. ఈ సమాజానికి సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. మొత్తం సమాజం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అరచేతుల్లో పెట్టి రక్షించుకోవాల్సిన కర్తవ్యం మీ అందరిపై ఉందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





