– కాంగ్రెస్ పాలనపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకుందని, అయితే ప్రజలకు ఇచ్చిన హామీల అమలు బదులు, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని బీజేజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు భరోసా, చేయూత, యువ వికాసం, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఆరు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్.. వాటిలో అంతర్భాగంగా అనేక హామీలను చేర్చిందన్నారు. రూ.2 లక్షల పంట రుణ మాఫీని మమ అనిపించి చేతులు దులుపుకున్నారని, కౌలు రైతులకు సైతం రూ.12 వేలు, ప్రతి మహిళకూ నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం, యువ వికాసం పేరిట విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ వంటి హామీలేవీ అమలు చేయలేదని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు.. నిరుద్యోగ భృతి లేదు.. రైతులు పండిరచిన పంటలకు రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీకి మంగళం పాడిరదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారంటీలను నెరవేర్చకుండా ఇప్పుడు విజయోత్సవాల పేరుతో మరోసారి ప్రజలను ప్రభావితం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో రెండేళ్లుగా అమలు కాని హామీల అమలు కోసం ప్రజావంచన కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ ఈనెల 7న బీజేపీ ఆధ్వర్యంలో ుహాధర్నా చేపడుతున్నామని ప్రకటించారు. ఈ మహా ధర్నాలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


