– సర్వేపల్లి జయంతి కార్యక్రమంలో రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: భారత దేశ నిర్మాణంలో, అలాగే విద్యావ్యవస్థలో అనేక మార్పులకు కారణమైన సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులను గౌరవించుకోవాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యఠక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద సర్వేపల్లి విగ్రహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉపాధ్యాయులకు, విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. కనీసం వారి సమస్యలను, ఘోషను ప్రభుత్వం పట్టించుకోవాలిలన్నారు. ఇప్పటికీ ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీచర్లకు సకాలంలో జీతాలు రావడం లేదని, రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులకు పెన్షన్ల విషయంలో కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. సమాజంలో భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం అని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విశ్వవిద్యాలయాల ప్రగతికి, విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయాలకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని కేవలం ప్రకటనలు గుప్పించడం కాదు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలన్నారు. విద్యా సంస్థలను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రాధాన్యత కావాలి అని రామచందర్‌రావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





