గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ నిరసనలకు సిద్ధం

– రేపు ‘చలో గాంధీ దవాఖాన’
– కేంద్రం ‘జీ-రామ్-జీ’ బిల్లుకు వ్యతిరేకంగా టీపీసీసీ కార్యాచరణ
– శనివారం హైదరాబాద్ లో, ఆదివారం జిల్లాల్లో ఆందోళనలు
– పార్టీ శ్రేణులు కదలాలి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: జాతీయ ఉపాధి హామీ పథకం నుండి జాతి పిత మహాత్మా గాంధీ పేరును తొలగించి,దాని స్థానంలో ‘వికసిత్ భారత్ జి.రామ్.జిస పేరిట కొత్త బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ భగ్గుమంది. కాగా, ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం పిలుపునిచ్చారు.

ప్రధాన నిరసన కార్యక్రమాలు

శనివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ లోని గాంధీ దవాఖాన సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన చేపట్టనున్నారు. గాంధీ చిత్రపటాలు, గాంధేయవాద గీతాలతో బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించనున్నారు.  ఆదివారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఇదే తరహా నిరసనలు చేపట్టాలని డీసీసీ అధ్యక్షులను పార్టీ ఆదేశించింది.

కుట్రను తిప్పికొట్టాలి: మహేశ్ కుమార్ గౌడ్

ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో గాంధీ ఆద‌ర్శాలను చెరిపివేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదలకు ఒక భరోసా అని, దాని పేరు మార్చడం ద్వారా ఆ పథకంలోని ఆత్మను చంపేస్తున్నారని ఆరో పించారు. రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారా న్ని మోపుతూ, ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం దెబ్బతీస్తోందని విమర్శించారు. ఈ కుట్రను ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *