కాంగ్రెస్‌ హామీలపై నిలదీయండి

– బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి
– ప్రజలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి పిలుపు

తొర్రూరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7: కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చాక నెరవేర్చలేక ఫెయిలైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. లంబాడీలను బాగుచేసింది కేసీఆర్‌ అయితే ఆ లంబాడీ బిడ్డల హక్కులను కాలరాసే ప్రయత్నం ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నదని దుయ్యబట్టారు. పర్వతగిరి, తొర్రూరు, రాయపర్తి మండలాల్లో సర్పంచ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీలో కమీషన్ల కక్కుర్తితో మహిళా సంఘాల పేరుతో రూ.450 కోట్ల రుణంలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అని, రైతులకు రైతు బంధు, రైతు భరోసా పథకం ఇచ్చి అండగా నిలిచిన ఆపద్బాంధవుడు కేసీఆర్‌ అని తెలిపారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు వస్తే ప్రభుత్వ దొంగ హామీలను నిలదీసి ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని దయాకర్‌రావు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల ఎన్నికల ఇన్‌చార్జిలు, పార్టీ మండల అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులు, యూత్‌ సోషల్‌ మీడియా నాయకులు, స్థానిక నాయకులు, మహిళలు, తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *