హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 12: కామారెడ్డిలో ఈనెల 15న జరగనున్న సభను టీపీసీసీ వాయిదా వేసింది. భారీ వర్షాల సూచనతో సభను వాయిదా వేసినట్లు తెలిపింది. సభ తిరిగి ఎపుడు నిర్వహిస్తామనేది త్వరలో చెబుతామని ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి గడ్డ మీద నుంచే రిజర్వేషన్లకు అడ్డుగా ఉన్న బీజేపీ సర్కారు మీద సమర శంఖం పూరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కామారెడ్డిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. భారీ సభ నిర్వహించడం బీజేపీ ద ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. కామారెడ్డి సభకు కనీసం 2 లక్షల మందిని సకరించాలని పార్టీ నాయకులు టార్గెట్ గా పెట్టుకున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా జిల్లాల నుంచి ప్రధానంగా జనాన్ని తరలించాలని భావిస్తున్నారు. ఈ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో పీసీసీ లీడర్లు జనాలను తరలించే విషయంలో చర్చిస్తున్నారు. కామారెడ్డికి దగ్గరగా ఉండే మండలాలపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానుండడంతో గ్రామ, మండలస్థాయి లీడర్లు కూడా ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. సభకు కాంగ్రెస్ జాతీయస్థాయి నాయకులు హాజరు కావచ్చునని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సభ నిర్వహణ, జన సకరణ తదితర అంశాలను పరిశీలించేందుకు ఆదివారం కామారెడ్డిలో సన్నాహాక సమావేశం జరిగింది. సభ సక్సెస్ చేసేందుకు ఎలా పని చేయాలో పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్ మంత్రులు దిశానిర్దేశర చేశారు. అయితే తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరికతో సభను వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





