మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నాయకుడి హత్య

మెదక్‌, ప్రజాతంత్ర, జులై 15: జిల్లాలోని కొల్చారం మండలం వరిగుంతం శివారులో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కాంగ్రెస్‌ నాయకుడు అనిల్‌ మృతిచెందాడు. కొల్చారం మండలం పేతురుకు చెందిన కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌ ప్రయాణిస్తున్న కారును మరో కారు, ఆటో వెంబడిరచినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా బయటపడిరది. అనిల్‌ కారు వరిగుంతం దగ్గర నిర్మానుష్య ప్రాంతానికి రాగానే ఆయనపై దుండుగులు కాల్పులు జరిపారు. దీంతో కారులోనే అతను మృతిచెందాడు. శరీరంపై బుల్లెట్‌ గాయాలుండగా కారులో నాలుగు బుల్లెట్లు లభ్యమయ్యాయి. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కుటుంబంతో కొన్నేళ్లుగా అనిల్‌కు వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు, భూ వివాదాలలో సదరు ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన కారును అనిల్‌ తీసుకొచ్చినట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులతో అనిల్‌కు ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. నానక్‌రామ్‌గూడలోని ఆరు గుంటల స్థలం విషయంలో వారి మధ్య పది రోజుల క్రితం గొడవ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అనిల్‌ హత్యకు కారణాలపై అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అనిల్‌ చనిపోతూ తన ఎడమ చేతిపై ఓ ఫోన్‌ నెంబర్‌ను రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్‌ నెంబర్‌కు ీ హత్యకు సంబంధం ఉందా అనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెదక్‌ ప్రభుత్వ హాస్పిటల్‌లో అనిల్‌ మృతదేహానికి పోస్టుమార్టం జరిపారు. మార్చురీ వద్ద అనిల్‌ కుటుంబీకులను గ్రంథాలయ చైర్మన్‌ సుహాసిని రెడ్డి, నర్సాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *