కాంగ్రెస్‌ నేత జీవన్‌ ‌రెడ్డికి అస్వస్థత

– హుటాహుటిన నిమ్స్‌కు తరలింపు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 20: కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌ ‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ‌నిమ్స్ ‌హాస్పిటల్‌కు తరలించారు. ఫుడ్‌ ‌పాయిజన్‌ అయిందని  కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, జీవన్‌ ‌రెడ్డి కొంత‌కాలంగా కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్‌ఎస్‌ ‌నుంచి గెలిచి కాంగ్రెస్‌ ‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్ట‌ర్‌ సంజయ్‌, ‌జీవన్‌ ‌రెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఒక దశలో పార్టీని కూడా వీడతానని జీవన్‌ ‌రెడ్డి అలకబూనడంతో అధిష్ఠానం బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం తన వర్గం అభ్యర్థులును నిలబెట్టి గెలిపించుకున్నారు. సీనియర్‌ అయిన తనకు సరిగా గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తికి లోనవుతున్నారు. జీవన్‌ ‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జీవన్‌ ‌రెడ్డి మర్యాదకు భంగం కలిగించకండి : జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ ‌కష్ట కాలంలో పార్టీతో ఉన్న జీవన్‌ ‌రెడ్డికి గౌరవం ఇచ్చే విధంగా పార్టీ హైకమాండ్‌ ‌చొరవ తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌కార్యకర్తగా, నాయకుడిగా త‌న‌ వ్యక్తిగత అభిప్రాయాన్ని రాష్ట్ర ఇన్‌చార్జ్ ‌మీనాక్షి నటరాజన్‌, ‌పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌కు మీడియా ద్వారా  తెలియజేస్తున్నా. జీవన్‌ ‌రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చినా పరిస్థితులు అనుకూలించక ఓడిపోయారు. కాంగ్రెస్‌ ‌పదేళ్ల‌పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పార్టీలోనే ఉన్నారు. రాజకీయంగా జీవన్‌ ‌రెడ్డికి ఎన్నో ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్‌తోనే ఉన్నారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్న జీవన్‌ ‌రెడ్డికి అవమానం జరగకుండా కాంగ్రెస్‌ ‌పెద్దలు చొరవ చూపాలి. జీవన్‌ ‌రెడ్డికి గౌరవం వచ్చే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారిని కోరుతున్నానన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, జీవన్‌రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్ ‌హాస్పిటల్‌కి తరలించారు. అయితే, ఫుడ్‌ ‌పాయిజన్‌ అయిందని జీవన్‌ ‌రెడ్డి కుటుంబ సభ్యులు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *