మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్సే కార‌ణం

– మండిపడ్డ బీజేపీ
– పార్లమెంటులో ప్రస్తావించిన కిషన్‌రెడ్డి, లక్క్ష్మణ్
– డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ శ్రేణుల యత్నం, ఉద్రిక్తత

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: నారాయణపేట జిల్లా మక్తల్ 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ భగ్గుమంది. ప్రత్యర్థుల వేధింపుల వల్లనే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ కిడ్నాప్‌లకు, బెదరింపులకు పాల్పడిందని ఆరోపిస్తూ అందుకు నిరసనగా హైదరాబాద్ డీజీపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయం ముందు భారీగా పోలీసులు భారీగా మోహరించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించారు. బారికేడ్లు దూకేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించగా కొందరిని అరెస్టు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు.

కాగా, లోక్‌సభలో కిషన్ రెడ్డి, రాజ్యసభలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షుడు డాక్టర్ లక్క్ష్మణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రత్యర్థులు భయంతో వణికేలా చేస్తున్నారని రాజ్యసభలో లక్క్ష్మణ్ ఆరోపించారు. గెలవడం ఖాయం.. గెలిచిన తర్వాత కూడా నన్ను అధికార పార్టీ వేధిస్తుందని తన భార్యతో చెప్పి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడని లక్ష్మణ్ తెలిపారు. రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ప్రాజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా దురాగతాలకు పాల్పడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.  రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని లోక్‌సభలో కిషన్ రెడ్డి ఆరోపించారు. 

కాంగ్రెస్ చేసిన హత్య : బండి సంజయ్‌

మహదేవప్పది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ను రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోందన్నారు. మా సహనాన్ని పిరికితనంగా భావిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్‌పై యుద్దం చేయబోతున్నామని, బీఆరఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులొచ్చాని అన్నారు. బీజేపీ కార్యకర్తలారా ధైర్యంగా ఉండండి.. పార్టీ నాయకత్వం మీకు అండగా ఉంది అని అన్నారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని, నిష్పాక్షికంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షాంచాలని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *