– నైతిక విజయం మాదే : ఎమ్మెల్యే వేముల
నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి గెలిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలదే అని అన్నారు. అధికారంలో ఉన్నామని నిబంధనలకు విరుద్ధంగా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని, రాత్రింబవళ్లు నోట్ల కట్టలు పంపిణీ చేసి మద్యాన్ని ఏరులై పారించారని ఆరోపించారు. కొన్నిచోట్ల రిగ్గింగ్ చేయడం వల్లే గెలిచారన్నారు. అయినప్పటికీ మెజారిటీ సీట్లు సాధించలేకపోయిందని ఎద్దేవా చేశారు. అధికార బýంతో ఎన్నికల్లో గెలిస్తే అది విజయం కాదని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ తీరును గమనిస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని కాంగ్రెస్ నాయకులు చెప్ప్పుకుంటున్నప్పటికీ ఆ పార్టీ సాంకేతికంగా విజయం సాధించిందే తప్ప నైతికంగా గెలిచింది బీఆరఎస్ పార్టీనే అని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓడినా, గెలిచినా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని ఎమ్మెల్యే అన్నారు. అధికార పార్టీ అభ్యర్థులకు బీఆరఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





