సెక్యులరిజానికి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ

– ముస్లింలకు అండగా ఉండేది కాంగ్రెస్సే
– మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, ప్రజాతంత్ర, మార్చి 9: దిల్లీ నుండి గల్లీ వరకు ముస్లింలకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సర్వమతాలను సమానంగా చూస్తూ వారివారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న పార్టీ కూడా కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ దేశంలో సెక్యులరిజానికి పెద్ద పీట వేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. లోక్సభలో పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మొదలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ముస్లింల సంక్షేమానికి నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే సెక్యులరిజానికి కాంగ్రెస్ పార్టీ కేరాఫ్‌గా నిలిచిందన్నారు. ముస్లింల రక్షణతోపాటు వారి అభివృద్ధితోపాటు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పెద్ద పీట వేశాయని ఆయన గుర్తుచేశారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆనందదాయకంగా ఉందన్నారు. సూర్యాపేటలో ముస్లింల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా మంత్రిగా నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. జిల్లా కేంద్రంలో షాదిఖానా, కమ్యూనిటి హాల్, ఖబరస్థాన్ వంటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వోత్తం రెడ్డి, పార్టీ జిల్లా అద్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మోరిశెట్టి నివేదిత, పీసీసీ కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *