– ఆదిలాబాద్‌కు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్‌కు ఉత్తమ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్నిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్‌చార్జిలుగా మంత్రులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా ఆయా మంత్రులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. 15 నియోజకవర్గాలకుగాను 15మంది మంత్రులు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. సంబంధిత రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. ఆదిలాబాద్‌కు మాత్రం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారు. నిజామాబాద్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. మల్కాజిగిరి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చేవెళ్ల- దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్-తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం-కొండా సురేఖ, మహబూబాబాద్-పొన్నం ప్రభాకర్, మహబూబ్‌నగర్- దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్-అజారుద్దీన్, మెదక్ – వివేక్ వెంకటస్వామి, నాగర్‌కర్నూల్-వాకిటి శ్రీహరి, నల్గొండ- అడ్లూరి లక్క్ష్మణ్ కుమార్, యాదాద్రి-భువనగిరికి సీతక్క, వరంగల్ – పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి- జూపల్లి కృష్ణారావులను నియమించారు. తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వీరు కృషి చేయాల్సి ఉంటుంది.
—————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



