’బాకీ కార్డులు’ఆవిష్కరించిన మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జనవరి 7: ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా విఫలమైందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో బాకీ కార్డులను బుధవారం ఆవిష్కరించారు. మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం, విద్యార్థులకు స్కూటీలు, రైతులకు రైతు భరోసా సహాయం, రుణ మాఫీ చేయకుండా ప్రజలకు బాకీ పడిరదన్నారు. ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ నాయకులను ఎక్కడిక్కడ నిలదీయాలన్నారు. ఈ బాకీలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



