నాటేందకు సిద్ధంగా 40 లక్షల తాటి మొక్కలు
అన్ని కులాలకు ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్
ఖమ్మంలో గౌడ కుల కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపనలో పొన్నం
హాజరైన మంత్రులు భట్టి, తదితరులు
ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 09: గౌడల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే 40 లక్షల తాటి మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. గీత కార్మిక బిడ్డగా తాను మంత్రిగా పనిచేస్తున్నానంటూ రాబోయే కాలంలో అందరూ ఉన్నత స్థానంలో ఉండేందుకు కష్టపడాలని సూచించారు. కుల వృత్తి పరంగా చేసేవారు చేయండి.. కానీ పిల్లలను మాత్రం చదివించాలన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులాలకు అవకాశం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ గౌడ్‌లకు సంబంధించి కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలంటూ తనను, మహేష్ కుమార్ గౌడ్‌ను బాలసాని లక్ష్మీనారాయణ కలిశారన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మంత్రుల వద్ద మాట తీసుకున్నానని చెప్పారు. వేములవాడలో 45 గదులతో సత్రం కడుతున్నామన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసింది.. కులగణన సమయంలో ఎందుకు అని అందరూ ప్రశ్నించారు.. నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా ప్రభుత్వం అన్ని కులాలకు అవకాశం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తాను గౌడ కులంలో జన్మించానని, అందుకు ఎంతో గర్విస్తున్నానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కుల వ్యవస్థ, కుల వృత్తులు లేనిదే దేశం లేదంటూ కుల వృత్తులు అంతరించిపోకుండా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు. గౌడ వృత్తిని గొప్ప వృత్తిగా చెప్పుకోవాలని, ప్రతిరోజూ గౌడలు తాటి చెట్టు ఎక్కి దిగడం అంత ఆషామాషీ కాదని పేర్కొన్నారు. వెనుకబడ్డ తరగతుల వారికి సమన్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష అని ఆయన చెప్పారు. హిమాయత్ నగర్ గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మించారని, నిజామాబాద్‌లో రెండున్నర ఎకరాల్లో నిర్మిస్తున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రేవంత్ రెడ్డి సీఎం, భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు అంటే కారణం ఖమ్మం జిల్లానే’ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రిజర్వేషన్ తీసుకుని వచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్దామని చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది.. పేద వారికి ఫలాలు అందాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీది.. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు.. వచ్చే సంవత్సరం నాటికి కమ్యూనిటీ హాల్ పూర్తి చేసుకునే బాధ్యత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలదే.. నైపుణ్యం, చైతన్యం ఖమ్మం జిల్లాలో ఉంది.. అధికారంలోకి వచ్చి 18 మాసాలు గడిరచింది.. రూ.లక్షా 78 వేల కోట్ల విదేశీ నిధులు తెచ్చాం అని వివరించారు. ఈ నెలలో కార్పొరేషన్, డైరెక్టర్లను భర్తీ చేస్తాం. .కార్యకర్తలను నమ్ముకున్న పార్టీ కాంగ్రెస్. కింది స్థాయి కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది.. విూ శ్రమ వల్లనే అధికారంలోకి వచ్చాం’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.





