ములుగు పీఠం కాంగ్రెస్ కు ద‌క్క‌డం సంతోష‌క‌రం

– మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ములుగు మున్సిపాలిటీ ఎన్నికలు జరగగా  ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 12 మంది గెలవడం చాలా సంతోషంగా ఉందని ములుగు మున్సిపాలిటీలో మొట్ట మొదటి పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేలా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులందరీకి మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వార్డులవారిగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 1వ వార్డు అలోత్ పద్మ దేవ్, 3వ వార్డు యాసం వసంత రవికుమార్ ,4వ వార్డు గుంటొజు పావని నిరంజన్ చారి,5వ వార్డు గుగ్గిళ్ళ దివ్య సుజన్ , 6వ వార్డు చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి ,8వ వార్డు నల్లెల్ల స్వాతి భరత్ కుమార్, 10వ వార్డు గజ్జెల సుస్మిత ,11వ వార్డు కేశెట్టి నవీన్ ,13వ వార్డు సిలువేరు సాంబయ్య,14వ వార్డు ఆసియా షాహిన్ రియాజ్ మీర్జా ,16వ వార్డు ఎండీ కుతుబుద్ధిన్, 19వ వార్డు పౌడల ఓంప్రకాష్ లకు మంత్రి సీతక్క కండువా కప్పి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల విజయానికి కష్ట ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు,యూత్ నాయకులకు, ఇంచార్జీలకు,మండలాల అధ్యక్షులకు,మహిళా నాయకులకు సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, జిల్లా నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *