– ఆనాటి మోదీ విమర్శల వీడియోను పోస్టు చేసిన జైరామ్ రమేష్
న్యూదిల్లీ, నవంబర్ 24: రూపాయి విలువ దారుణంగా పడిపోవడంపై కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది. శుక్రవారం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 89 రూపాయలకు పడిపోయింది. రికార్డు స్థాయిలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేసింది. 2013 యుపీఏ హయాంలో రూపాయి విలువ పడిపోవడంతో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో కాంగ్రెస్ కూడా మోదీపై విమర్శల దాడి చేసింది. 2013 జూలైలో తాను చెప్పింది ప్రధానికి గుర్తుందా అంటూ అప్పుడు మోదీ మాట్లాడిన వీడియోను ఎక్స్ వేదికగా కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సోమవారం పోస్టు చేశారు. రూపాయి ఎంత వేగంగా పతనమవుతున్నదో చూడండి.. కొన్నిసార్లు రూపాయి, దిల్లీలో ప్రభుత్వానికి మధ్య పోటీ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అయితే రూపాయి పతనంపై దురుద్దేశపూరిత వ్యాఖ్యలు చేసినా అలా అన్న వారి గౌరవం కూడా వేగంగా దిగజారిపోతుంది అని జైరాం ఈ వీడియోకు జతగా పోస్టు చేశారు. గత మూడేళ్లుగా అత్యంత కనిష్ట స్థాయిలోనే రూపాయి విలువ పడిపోతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




