చ‌ట్టాన్ని తెచ్చిన కాంగ్రెస్సే దాన్ని తుంగ‌లో తొక్కింది

– బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17ః ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు తీవ్రంగా తప్పుపట్టారు. స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగ హత్య, ప్రజాస్వామ్య హత్య అని అన్నారు. స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడతామని పదేపదే చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ అయిన స్పీకర్‌ను కూడా ప్రభావితం చేసి రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోకుండా చేసిందని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే. అలాంటి పార్టీనే ఈరోజు ఆ చట్టానికీ, రాజ్యాంగానికీ గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తోందని, చేతుల్లో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతున్న నాయకులే రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన స్పీకర్‌పై ప్రభావం చూపి ఈ తరహా నిర్ణయం తీసుకునేలా చేశారని ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *