బీసీలను అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెస్‌

– బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో విమర్శించారు. చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించి ఓట్ల రాజకీయాల కోసం కాంగ్రెస్‌ బీసీలకు ఘోర అన్యాయం చేసిందన్నారు. కోర్టులో సమర్థవంతంగా వ్యవహరించలేకపోవడం వల్లే ఈ పరిణామం చోటుచేసుకుందని ఆయన అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ సందర్భంగా రాహుల్‌ గాంధీ చిత్తశుద్ధి లేకుండా న్యాయపరమైన సమీక్షకు నిలుస్తుందా లేదా అన్నదానిపై నిపుణుల సలహాలు తీసుకోకుండా కేవలం అమాయక బీసీల ఓట్ల కోసం రాజకీయ స్టంట్‌ చేశారన్నారు. రాష్ట్రంలో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి అమాయక బీసీలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యారు కనుక ఆయనకు నైతికంగా ఆ పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకునే వరకు బీజేపీ ఊరుకోదని, బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని కాసం హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *