- పది మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ చైర్మన్ల ఎన్నిక
వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 10 మున్సిపాలిటీలలో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాగా రాగా హంగ్ ఏర్పడిన తొర్రూర్, జనగామ మున్సిపాలిటీలు లక్కీ డ్రా ద్వారా చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తొర్రూరు, జనగామలో సోమవారం పరస్పర విమర్శలు, ఆరోపణల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అయితే ఎన్నికను వాయిదా వేసి మంగళవారం నిర్వహించారు. జనగామ మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా బాలామణి (కాంగ్రెస్), వైస్ చైర్మన్: పర్వతాలు (బీఆర్‌ఎస్) ఎన్నికయ్యారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్: తూనం శ్రవణ్ (కాంగ్రెస్)వైస్ చైర్ పర్సన్: రజిని ఎన్నికయ్యారు. డోర్నకల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్: కుండేటి రాజకుమారి, వైస్ చైర్మన్: లావణ్య ఎన్నికయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్: బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్: శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఇదిలావుంటే తొర్రూరు మున్సిపాలిటీ పీఠం బీఆర్‌ఎస్‌కు దక్కకుండా ఉండాలని కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించు కునేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నిందన్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు వెళ్లకుండా ఇంచార్జిలు మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తొర్రూరు వెళ్లకుండా మహబూబాబాద్‌ఋలోనే సత్యవతి రాథోడ్‌ను హౌస్ అరెస్టు చేశారు. ఇక మధుసూదనచారిని హన్మకొండలో సుబేదారి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. నిన్న ఉద యం 10 గంటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తొమ్మిది మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో కలిసి తొర్రూరుకు చేరుకున్నారు. అయితే అన్నారం రోడ్డు వద్ద ఆయనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు అభ్యంతరం తెలుపడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. మాజీ మంత్రి దయాకర్‌రావును అడ్డుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య తొర్రూరు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకునే క్రమంలో బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఒకే వోటును రెండుచోట్ల వినియోగించొద్దని అంటూ ఖమ్మం -వరంగల్ జాతీయ రహదారిపై కారుకు అడ్డంగా బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ లాఠీచార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టి ఎంపీని అనుమతించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో దయాకర్‌రావు పీఏ భాసర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆయనను రక్షించారు. విషయం తెలుసుకున్న దయాకర్‌రావు మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తన 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ ఖాతాలో ఇంద్రేశం
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి17: జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా కిషంగుల ప్రల, వైస్ చైర్మన్‌గా పటోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇంద్రేశం పురపాలికలో మొత్తం 18 వార్డులకుగాను అత్యధికంగా 9 వార్డులను బీఆర్‌ఎస్ గెలుచుకోగా, ఆరు వార్డులు కాంగ్రెస్, రెండు వార్డులు బీజేపీ, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. కానీ, నిన్న జరగాల్సిన చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ఇవాళ ఎన్నిక నిర్వహించగా మున్సిపల్ పీఠాన్ని బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




